Producer SKN: మెగా ఫ్యామిలీకు మరో భక్త నిర్మాతగా ఎస్‌కేఎన్‌ !

మెగా ఫ్యామిలీకు మరో భక్త నిర్మాతగా ఎస్‌కేఎన్‌ !

Hello Telugu - Producer SKN

Producer SKN: మెగా ఫ్యామిలీకు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏకలవ్య భక్తుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. బండ్ల గణేష్ ఏ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్నా… తన దేవుడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పే మాటలు అభిమానులే కాదు సాక్ష్యాత్తూ పవన్ కళ్యాణ్ కు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు… ఓ వారం పదిరోజుల పాటు సోషల్ మీడియాను ఓ కుదుపుకుదిపేస్తాయి. బండ్ల గణేష్‌ ప్రతి స్పీచ్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బండ్లన్న కాస్త సైలెంట్ అయ్యాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుండి గెలుపొందడమే కాకుండా తన జనసేన పార్టీను 100 శాతం స్ట్రైక్ రేట్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారడంతో… అడపాదడపా న్యూస్ ఛానెల్స్ తో బండ్ల గణేష్ మాట్లాడుతున్నారు. అయితే సినిమా ఫంక్షన్లలో మాట్లాడటానికి ఇంతవరకు అతనికి అవకాశం రాలేదు. దీనితో అతని మాటలకోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Producer SKN…

ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ స్థానంను భర్తీ చేసే విధంగా బన్నీకి అత్యంత ఆప్తుడిగా పేరున్న ఎస్‌కేఎన్‌(Producer SKN) స్టేజ్ పై దడదడలాడిస్తున్నాడు. బండ్ల కంటే ఒక ఆకు ఎక్కువ చదివినట్లుగా ఎస్‌కేఎన్ స్పీచ్ లు ఉంటాయి. మెగా ఫ్యామిలీ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే ఫ్యాన్స్ అలా వింటూనే ఉండాలి అనుకుంటారు. అల్లు అర్జున్‌ గురించి ఇతర మెగా ఫ్యాన్స్ గురించి ఎవరైనా ఏమైనా చిన్న మాట మాట్లాడినా కూడా పడి పోయి మరీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చే ఎస్‌కేఎన్‌(Producer SKN) తాజాగా మరోసారి స్టేజ్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో ఎస్‌కేఎన్‌ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్‌(Producer SKN) మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ఎస్‌కేఎన్‌ పది రోజుల పాటు ప్రచారం చేయడం జరిగింది. పవన్ గెలిచి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంతో ఎస్‌కేఎన్‌ సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో తనదైన ప్రాసలో అన్నయ్య తో దండం పెట్టించుకున్న వ్యక్తికి తమ్ముడు పిండం పెట్టాడు అని అన్న మాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. గతంలో జగన్ మోహన్ రెడ్డి వద్దకు టాలీవుడ్‌ సమస్యలను తీసుకు వెళ్లేందుకు చిరంజీవి స్వయంగా వెళ్లారు. ఆ సమయంలో చిరు చేతులు ఎత్తి నమస్కారం పెడితే జగన్ నవ్వుతూ గర్వంగా వ్యవహరించాడు. ఆ దృష్యాలు మెగా ఫ్యాన్స్ ను తీవ్రంగా కలచివేశాయి. అందుకే పవన్‌ ఘన విజయం తో అన్నయ్య గౌరవం నిలిచిందని మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు. అదే విషయాన్ని ఎస్‌కేఎన్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎస్‌కేఎన్‌ వ్యాఖ్యలు బండ్ల గణేష్ తరహాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Also Read : Megastar Chiranjeevi: హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com