KP Chowdhary : సినీ నిర్మాత కేపీ చౌదరి సూసైడ్ కు పాల్పడ్డాడు. కొంత కాలం నుంచి ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. గోవాలో ఈ ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. ఆయన పూర్తి పేరు కృష్ణ ప్రసాద్ చౌదరి.
KP Chowdhary Suicude
తను 2016వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ తెలుగు వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరించారు కేపీ చౌదరి. అంతే కాకుండా పలు విజయవంతమైన తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా పని చేశారు. కబాలి మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు.
నిర్మాతగా సక్సెస్ కాక పోవడంతో గోవాకు వెళ్లాడు. అక్కడ ఓమ్ పేరుతో పబ్ ను స్టార్ట్ చేశాడు. అది కూడా లాస్ లో నడవడంతో చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. తనకున్న పరిచయాలతో సెలబ్రిటీస్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి ఉన్నట్లు కేసు నమోదైంది.
Also Read : Hero Balakrishna : ఏ రంగంలో నైనా నాకు నేనే పోటీ