SS Rajamouli:రాజమౌళి-మహేశ్‌ సినిమా ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు !

రాజమౌళి-మహేశ్‌ సినిమా ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు !

Hello Telugu - SS Rajamouli

SS Rajamouli:దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నారని నిర్మాత కె.ఎల్‌. నారాయణ అన్నారు. 15 ఏళ్ళ క్రితం వారిద్దరు ఇచ్చిన మాట ప్రకారం ‘SSMB29’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాని వాళ్లే స్వయంగా ప్రకటించి… పనిపై ఉన్న నిబద్ధతను చాటారని కొనియాడారు. గతంలో ‘హలో బ్రదర్‌’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘సంతోషం’ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన కెఎల్ నారాయణ… సుదీర్ఘ విరామం అనంతరం మరల ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ని ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాపై ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

SS Rajamouli:

‘‘ఉద్దేశపూర్వకంగా నేను నిర్మాతగా విరామం తీసుకోలేదు. రాజమౌళి(SS Rajamouli)– మహేశ్‌ బాబు కాంబినేషన్‌ సినిమాను 15 ఏళ్ల క్రితమే ఫిక్స్‌ చేశాం. ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్‌ మరో స్థాయిలో ఉంది. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా ‘దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌’లో మూవీ తీయనున్నట్లు వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్‌ నుంచీ ఆఫర్లు వచ్చాయి. వాటిని కాదనుకుని నా కోసం సినిమా చేస్తున్నారు. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ సాగుతోంది’’

‘‘నిర్మాతలు కథా చర్చల్లో పాల్గొనరనే మాట ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. అది అందరి విషయంలో నిజం కాదు. రాజమౌళి ప్రతి విషయాన్ని నిర్మాతలతో పంచుకుంటారు. పేపర్‌ వర్క్‌ చేస్తున్నప్పుడే క్లారిటీ ఉండడం మంచిదనే ఉద్దేశంతో ఏమైనా సందేహం ఉంటే చెప్పమని అడుగుతారు. చిన్న పాయింట్‌ నీ ఆయన ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో దగ్గర ఉండి చూస్తున్నా. పాత్రకు తగ్గట్టు మహేశ్‌ తనని తాను మలుచుకుంటున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి గ్లోబల్ హిట్ తరువాత తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్‌ చేస్తున్నారు. స్టోరీ బాగుంది. బడ్జెట్‌ ని ఇంకా డిసైడ్‌ చేయలేదు. ప్రొడక్టుకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టేందుకు సిద్ధం’’ అని అన్నారు.

Also Read :Rakul Preet Singh Vs Nikita Dutta

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com