హర్రర్ సినిమాతో వస్తున్న ఉపేంద్ర భార్య
Priyanka Upendra : జేడి చక్రవర్తితో ‘సూరి’, ఉపేంద్రతో ‘రా’… తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కన్నడ హీరో ఉపేంద్ర భార్య, నటి ప్రియాంక ఉపేంద్ర… ‘క్యాప్చర్’ అనే హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో యాభై సినిమాలు పూర్తి చేసుకున్న ప్రియాంక ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ‘క్యాప్చర్’ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో ప్రియాంక(Priyanka Upendra) నెత్తుటి మరకలతో నవ్వుతూ కనిపిస్తున్నారు. మరోవైపు, ఆమె చుట్టూ సీసీ కెమెరాలు, కొందరు వ్యక్తుల చేతులు, ఓ కెమెరాపై కాకి కనిపించడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీని సీసీటీవీ ఫార్మాట్ (సీసీ ఫుటేజ్ చూస్తున్నట్లుగా)లో చిత్రీకరించినట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. సీసీటీవీ ఫార్మాట్ లో రూపొందిన తొలి సినిమా ‘క్యాప్చర్’ విడుదలకు సిద్ధంగా ఉందని, త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలిపింది. దర్శకుడు హెచ్. లోహిత్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలకానున్నట్లు తెలుస్తోంది.
Priyanka Upendra – యాభై సినిమాలు పూర్తి చేసుకున్న బెంగాలీ భామ
కన్నడ హీరో ఉపేంద్రతో ‘రా’ సినిమాలో నటించిన బెంగాలీ భామ ప్రియాంక… ఆ తరువాత అతడ్నే పెళ్ళి చేసుకుని సెటిలయ్యింది. పెళ్ళి చేసుకున్నప్పటికీ తాను సినీ జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, ఓరియా భాషల్లో ఇప్పటివరకు 49 సినిమాల్లో నటించిన ప్రియాంక ఉపేంద్ర… తన యాభై సినిమా ‘డిటెక్టివ్ తీక్షణ’ ను కూడా పూర్తి చేసింది. త్రివిక్రమ రఘు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏడు భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తన 51వ సినిమాగా హర్రర్ థ్రిల్లర్ సినిమా ‘క్యాప్చర్’ ను కూడా దాదాపు పూర్తి చేసింది. లోహిత్- ప్రియాంక కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మమ్మీ’, ‘దేవకి’ సినిమాలు కన్నడనాట మంచి విజయాన్ని అందుకున్నాయి.
Also Read : Jawan OTT Record : బాద్ షా ఓటీటీలో షెహన్ షా