Priya Bhavani Shankar : శరీరాన్ని వస్తువుగా చూపించి ప్రేక్షకులను ఆకర్షించడం నచ్చదు

దానిని నేను సౌకర్యవంతంగా భావించలేను...

Hello Telugu - Priya Bhavani Shankar

Priya Bhavani Shankar : గ్లామర్‌ రోల్స్‌, స్కిన్‌ షో చేయడంపై అసహనం వ్యక్తం చేశారు తమిళనటి ప్రియా భవానీ శంకర్‌(Priya Bhavani Shankar). ప్యాషన్‌ పేరుతో శరీరాన్ని చూపించడం తనకు ఇష్టం లేదన్నారు. ‘ కళ్యాణం కమనీయం’ తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె కోలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమా ‘బ్లాక్‌’ గురించి మాట్లాడారు. ‘‘ నా శరీరాన్ని ఒక వస్తువుగా భావించను. ప్రేక్షకులను రప్పించడం కోసం గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదు. అలాంటి వాటిని అంగీకరించను. కెరీర్‌ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదనుకుంటాను. అందుకు అనుగుణంగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా. నెగెటివ్‌ రోల్‌ చేయడానికీ వెనుకాడను. ఎందుకంటే అది నా వృత్తి. అలాగే, ఒక హీరోయిన్‌గా ఫ్యాషన్‌ పేరుతో కొన్నింటిని ప్రమోట్‌ చేయలేను’’ అని అన్నారు. గ్లామర్‌ పాత్రలు గురించి ఆమె గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

Priya Bhavani Shankar Comment

‘‘అతి తక్కువ సమయంలో పామ్‌లోకి వెళ్లి, ఫేం తెచ్చుకోవడానికి గ్లామర్‌ అనేది అడ్డదారి అని చాలామంది భావిస్తుంటారు. నిజం చెప్పాలంటే అది చాలా కష్టమైన పని. దానిని నేను సౌకర్యవంతంగా భావించలేను. అదీకాక ప్రేక్షకులు నన్ను గ్లామర్‌ పాత్రల్లో చూడటానికి ఇష్టపడరు’’ అని అన్నారు. ఇక తాజా చిత్రం ‘బ్లాక్‌’ విషయానికి వేస్త.. జీవా హీరోగా నటించిన ఈ చిత్రానికి బాల సుబ్రమణి దర్శకత్వం వహించారు. హారర్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని. అక్టోబర్‌ 11న విడుదల కానుంది.

Also Read : 35 Chinna Katha Kaadu OTT : ఓటీటీలోను పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న నివేత థామస్ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com