Prithviraj Sukumaran: ఓటీటీలో ‘ఆడు జీవితం’ ! స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదేనా ?

ఓటీటీలో 'ఆడు జీవితం' ! స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదేనా ?

Hello Telugu - Prithviraj Sukumaran

Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించిన తాజా సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా సర్వైవల్‌ థ్రిల్లర్‌ గా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అమలపాల్‌ కథానాయిక. ‘దిగోట్‌ లైఫ్‌’ పేరుతో ఈ సినిమా ఇంగ్లీష్‌ లోను ‘ఆడు జీవితం’ పేరుతో మలయాళం, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మార్చి 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ట్రైలర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ చిత్రాల జాబితాలో చేరిపోయిన ‘ఆడు జీవితం’… ఇప్పుడు ఓటీటీ విడుదలకు రెడీగా ఉంది. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా… మే 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని వార్తలు వస్తున్నాయి. డిస్నీ+హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. అగ్రిమెంట్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, సినిమా విడుదలైన సమయం నుంచి 40 రోజుల తర్వాత OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫారమ్‌ లలో విడుదలచేయవచ్చు. దీని ప్రకారం మే 10న ఓటీటీలో ఆడు జీవితం విడుదల కానుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి కాని… ఓటీటీ ఫ్లాట్ ఫాం నుండి కాని అధికారికంగా ప్రకటన రాలేదు.

Prithviraj Sukumaran – ‘ఆడు జీవితం’ కథ ఏమిటంటే ?

వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కేరళకు చెందిన నజీబ్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్‌ ‘గోట్‌ డేస్‌’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్‌ నిర్మించారు. నజీబ్‌ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్‌ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి, భారతదేశంలో అత్యధిక అవార్డులు పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌ వంటి టాప్ టెక్నీషియన్స్ తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించారు.

Also Read : Sonali Bendre: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరోయిన్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com