Prithi Mukundan: నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో మంచు కుటుంబం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోతోన్న సినిమా ‘కన్నప్ప’. ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్, శివరాజ్‌కుమార్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కీచా ఖామ్‌ఫక్డీ రంగంలోనికి దించారు. సుమారు ఐదు నెలలుగా న్యూజీలాండ్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుతోంది. భారీ తారాగణంతో రానున్న ఈ ఫాంటసీ డ్రామాతో ఓ మోడల్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు మోడల్‌గా పలు ప్రకటనల్లో కనిపించిన ప్రీతి ముకుందన్(Prithi Mukundan) ‘కన్నప్ప’తో వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇదే విషయాన్ని ‘కన్నప్ప’ నిర్మాణ సంస్థ అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
Prithi Mukundan – నుపుర్ సనన్ స్థానంలో ప్రీతి ముకుందన్
మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా నుపుర్ సనన్ ని ఎంపిక చేశారు. అయితే డేట్స్ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగింది. తాజాగా ఈ సినిమాలో ప్రీతి ముకుందన్‌ను తీసుకుంటున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘‘కన్నప్ప’తో ప్రీతి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎంతో ప్రతిభ కలిగిన ఈ భరతనాట్య నర్తకి సినిమాకు మరింత ప్రత్యేకం కానుంది’ అని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా మోహన్ బాబు, శరత్ కుమార్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించిన చిత్ర యూనిట్ మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ‘కన్నప్ప(Kannappa)’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పోస్టర్ చూసిన వారంతా పాన్ ఇండియా సినిమా స్థాయికి సరిపోయే విధంగా ఫస్ట్ లుక్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Rana Naidu: వెబ్ సిరీస్ లో ‘రానా నాయుడు’ రికార్డు