Premgi Amaren: కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నామంటే కొత్త ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉండటం సర్వ సాధారణం. గడచిన ఏడాది ఎదురైన చేదు అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలతో… కొత్త సంవత్సరాన్ని కోటి ఆశలతో ప్రారంభిస్తారు. ఇళ్ళు కట్టాలి, అప్పు తీర్చాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, కారు కొనాలి, డైట్ మెయింటైన్ చేయాలి, జంక్ ఫుడ్ మానేయాలి, ఖర్చు తగ్గించుకోవాలి ఇలా ఎన్నో అనుకుంటారు. వాటిని విజయవంతంగా అమలు చేయడంలో కొంతమంది సఫలీకృతులవగా… మరికొందరు మాత్రం వచ్చే ఏడాది అమలు చేద్ధాంలే అంటూ లైట్ తీసుకుంటారు. కాని లేటు వయసులో ఉన్నప్పటికీ… కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలని మాత్రం ఎవరూ అనుకోరు. ఒకవేళ అనుకున్నా బయటకు మాత్రం చెప్పరు. అయితే కోలీవుడ్(Kollywood) సీనియర్ నటుడు మాత్రం 2024లో తాను పెళ్లి చేసుకోవడం ఖాయం అంటూ పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా… ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Premgi Amaren – పెళ్ళే లక్ష్యంగా కొత్త సంవత్సరం ప్రారంభించిన ఇళయరాజా బంధువు
కోలీవుడ్ లో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందారు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సోదరుడు జ్ఞాని అమరన్ చిన్న కుమారుడు ప్రేమ్ జీ అమరన్(Premgi Amaren). పున్నగై పూవె సినిమాతో నటుడిగా సినీ ప్రయాణం మొదలు పెట్టిన ప్రేమ్ జీ అమరన్… శింబు హీరోగా నటించిన వల్లభ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గోవా, సరోజ, బిర్యానీ, మంగత తదితర చిత్రాలు చేసిన ప్రేమ్ జీ అమరన్… డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో నటించాడు. కస్టడీ, ప్రిన్స్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 68వ సినిమాలో కూడా అమరన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే 44 ఏళ్ళ వయసు ఉన్న ప్రేమ్ జీ అమరన్ మాత్రం… కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా మిగిలిపోయాడు. దీనితో 2024 ఏడాదిని సీరియస్ గా తీసుకున్న ప్రేమ్ జీ… ఎలాగైనా ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూయర్. ఈ ఏడాది నేను వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తాను’ అంటూ పోస్ట్ పెట్టాడు.
దీనితో ప్రేమ్ జీ పోస్ట్ ను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది మీ నిర్ణయం వల్లనేనా మాస్టారు ? అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. లేటు వయసులో పెళ్లి చేసుకుని… ఇంకా పిల్లలు ఎప్పుడు అంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది మాత్రం ఈ ఏడాదైనా మీరు అనుకున్న చిరకాల కోరిక తీరాలి అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరి ఈసారైనా ప్రేమ్ జీ తన పెళ్లి విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడో లేదో చూడాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే !
Also Read : Guntur Kaaram Updates : అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతున్న ‘గుంటూరు కారం’