Preity Mukhundhan : ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో అనశ్వర రాజన్ , మమితా బైజు.. కన్నడ నాట రుక్మిణీ వసంత్, సప్తమి గౌడ వంటి నవ కథానాయికలు వరుస చిత్రాలతో దుమ్ము రేపుతున్నారు. అదే కోవలో బాలీవుడ్‌లో రష్మిక, కృతి సనన్, తమిళంలో ఇవానా, ప్రియాంక మోహన్ కుర్రకారు కలల రాణులుగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు నాట అయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ ఆ జాబితాలో చేరారు. ఇప్పటికే అయేషా ఖాన్ పాత్రతో సంబంధం లేకుండా ఐటం సాంగ్స్, చిన్న క్యారెక్టర్స్‌తో తెలుగులో అర డజన్ చిత్రాల వరకు చేస్తుండగా.. రీసెంట్‌గా వచ్చిన ఓం భీం భుష్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రీతి ముకుందన్(Preity Mukhundhan ) క్రమంగా వరుస ఛాన్సులను దక్కించుకుంటూ అగ్ర స్థానానికి చేరేలా కనిపిస్తోంది.
Preity Mukhundhan Movies
తాజాగా అమె నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప నుంచి అమె స్టిల్స్ బయటకి వచ్చాక ఇప్పుడు అందరి దృష్టి ఈ అమ్మడిపై పడింది. గత నెలలో ఈ అమ్మడు తమిళంలో కెవిన్‌తో నటించిన స్టార్ అనే సినిమాతోనూ ఆకట్టుకుని అందరి అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంది. తమిళనాడుకు చెందిన ప్రీతి ముకుందన్ మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఇప్పటికే చెన్నై షాపింగ్ మాల్ వంటి చాలా షోరూంస్ ప్రమోషన్స్ కార్యక్రమాలతో తమిళ, తెలుగు నాట బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఇటీవలే శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఓం భీం బుష్ చిత్రంతో హీరోయిన్‌గా ఆరంగేట్రం చేసింది. ఆ వెంటనే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో అవకాశం దక్కించుకుంది.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా అందులో ప్రీతి(Preity Mukhundhan) విజువల్స్ అందరినీ మెస్మరైజ్ చేశాయి.చాలామంది ఇందులో ప్రభాస్ లుక్స్ తర్వాత ఈ అమ్మడి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో యూత్ ఎవరీ ప్రీతి అంటూ సెర్చ్ చేస్తున్నారు. ఈ అమ్మడు రాబోవు రోజుల్లో అగ్ర స్థానానికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ తారాస్థాయికి చేరుకుంటుందో లేదో. ఆల్ ది బెస్ట్ ప్రీతి ముకుందన్.
Also Read : Shilpa Shetty Case : కోర్టు మెట్లెక్కిన ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి