Preity Mukhundhan : రెండు సినిమాలతో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రీతి

ఇంతకూ ప్రీతీ ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా...

Hello Telugu - Preity Mukhundhan

Preity Mukhundhan : టాలీవుడ్ ను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుండటంతో.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా.. అన్ని సినిమాలు భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. అలాగే కొంతమంది దర్శకులు ఫ్రెష్ కంటెంట్ తో పాటు కొత్త హీరోయిన్స్ ను రంగంలోకి దింపుతున్నారు. అలా టాలీవుడ్ కు పరిచయమైన భామే ప్రీతి ముకుందన్(Preity Mukhundhan). ఈ చిన్నది ఇటీవలే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి ప్రేక్షకులను కవ్వించనుంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వరుసగా పోస్టర్స్ ను విడుదల చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాలో నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్(Preity Mukhundhan) నటిస్తుందని అనౌన్స్ చేస్తూ ఓ అందమైన పోస్టర్ వదిలారు.

Preity Mukhundhan Movies..

ఇంతకూ ప్రీతీ ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..?ప్రీతి ముకుందన్ టీవీ షోలో నృత్య ప్రదర్శనలలో తన కెరీర్ ను ప్రారంభించింది.ప్రీతి ముకుందన్ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’ యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పేరొందినది. ఆతర్వాత ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ వచ్చాయి. శ్రీవిష్ణు సరసన ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో హీరోయిన్ గా మారింది.

‘ఓం భీమ్ బుష్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్నదాని ఫోటోలు చూస్తే నిజంగా నెమలి అనాల్సిందే. భారీ కథాంశంతో రూపొందుతున్న కన్నప్ప చిత్రానికి దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ భక్తుడు కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, అర్బిద్ రంగా, కౌశల్, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, మోహన్‌లాల్, తదితరులు నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడిగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Also Read : Sreeleela : ఆ బాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడ్డ తెలుగు హీరోయిన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com