Pratibha Ranta : ‘లపతా లేడీస్’ సినిమా ఆస్కార్ ఎంపికపై స్పందించిన ప్రతిభ

ఈ చిత్రం ఆస్కార్‌కు ఎంపిక కావడం పట్ల దర్శకురాలు కిరణ్‌రావు ఆనందం వ్యక్తంచేశారు...

Hello Telugu - Pratibha Ranta

Pratibha Ranta : ఆమిర్‌ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌(Laapataa Ladies)’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. దీనిపై ఆ సినిమాలో ప్రధాన పాత్ర పుష్పరాణిగా నటించిన ప్రతిభా రత్న(Pratibha Ranta) ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మా చిత్రం ఆస్కార్‌ బరిలో ఉండటం ఆనందంగా ఉంది. మాటలు రావడం లేదు. మేము ఈ చిత్రం ఆస్కార్‌కు మనదేశం నుంచి ఎంపికవ్వాలని ఎంతో కోరుకున్నాం. మా ఆశలు నిజమయ్యాయి. మా కష్ట్టానికి ఫలితం దక్కింది. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తూపోతే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ప్రస్తుతం నా విషయంలో ఇదే జరుగుతోంది. నేను ఊహించిన దాని కంటే రెట్టింపు ఆనందాన్ని పొందుతున్నా. కిరణ్‌రావు, ఆమిర్‌ఖాన్‌లను ఎప్పుడెప్పుడు కలుస్తానా’ అని ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు.

Pratibha Ranta Comment

ఈ చిత్రం ఆస్కార్‌కు ఎంపిక కావడం పట్ల దర్శకురాలు కిరణ్‌రావు ఆనందం వ్యక్తంచేశారు. ‘ అద్భుతమైన కథకు ప్రాణం పోసి తెరపైకి తీసుకు రావడానికి ఎంతో కృషి చేశాం. ఆ కష్టానికి దక్కిన ఫలితం ఇది. సరిహద్దులు దాటి.. మనుషులను చేరువ చేయడంలో సినిమా అనేది ఒక కీలక మాధ్యమంగా మారింది. ఇండియాలో ప్రేక్షకులు ఏ విధంగా ఈ చిత్రాన్ని ఆదరించారో ప్రపంచ స్థాయిలో అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేసింది.

దీనికి అస్సామ్‌ చెందిన దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. తాజాగా ఆయన ఈ చిత్రాన్ని ఎంపిక చేయడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘ జ్యూరీ అన్ని రంగాల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్‌ భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్‌ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్క రోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు.. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరూ చర్చించుకొని ‘లాపతా లేడీస్‌’ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా అన్నారు.

Also Read : Sundeep Kishan: సంక్రాంతికి సందీప్ కిషన్ ‘మజాకా’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com