Prathinidi 2: నాలుగు నెల‌ల త‌ర్వాత ఓటీటీకి వ‌చ్చిన‌ నారా రోహిత్ “ప్ర‌తినిధి 2” !

నాలుగు నెల‌ల త‌ర్వాత ఓటీటీకి వ‌చ్చిన‌ నారా రోహిత్ "ప్ర‌తినిధి 2" !

Hello Telugu - Prathinidi 2

Prathinidi 2: సుమారు ఐదారేండ్ల విరామం త‌ర్వాత నారా రోహిత్(Nara Rohit) న‌టించిన తాజా సినిమా “ప్ర‌తినిధి 2(Prathinidi 2)” . ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు మూర్తి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కించిన ఈ సినిమాలో సిరి, స‌చిన్ ఖేడేక‌ర్‌, జిష్ణు సేన్ గుప్తా, ఇంద్ర‌జ‌,త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. టీజర్, ట్రైలర్‌ల‌తోనే మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ కొన్నాళ్లు చ‌ర్చ‌ల్లో బాగా నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో మే 10న ధియేటర్లలో వ‌చ్చిన ఈ సినిమా… బాక్సాఫీసు వద్దు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా సుమారు నాలుగు నెల‌ల త‌ర్వాత ఓటీటీకి వ‌చ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా లో శుక్ర‌వారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Prathinidi 2 – “ప్ర‌తినిధి 2” క‌థ విష‌యానికి వస్తే…

నిజాన్ని నిర్భ‌యంగా చెప్పే జ‌ర్న‌లిస్ట్ చేత‌న్ (నారా రోహిత్‌). త‌న‌లాగే స‌మాజంపై బాధ్య‌త‌తో ఉన్న ఉద‌య‌భాను న్యూస్ ఛాన‌ల్‌ కు సీఈవోగా కొత్త బాధ్య‌తలు తీసుకుని త‌న సంచ‌ల‌నాత్మ‌క క‌థ‌నాల‌తో అన్ని వ‌ర్గాల్లో వ‌ణుకు పుట్టిస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఓ బాంబ్‌ బ్లాస్ట్‌ లో రెండో ప‌ర్యాయం కూడా సీఎంగా అధికారంలో ఉన్న ప్ర‌జాప‌తి చ‌నిపోతాడు. ఆపై చేత‌న్ ఈ ప‌ని చేశాడంటూ పోలీసులు అరెస్టు చేస్తారు. ఈ నేప‌థ్యంలో చేత‌న్‌ కు సీఎంకు మ‌ధ్య ఉన్న లింక్ ఏంటి, అ స‌లు సీఎంను ఎవ‌రు హ‌త్య చేశారు,ఎందుకు చేయించారు, ఈ కేసును నుంచి హీరో ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌నే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

అయితే సీఎం మరణం… అతని కొడుకుని సీఎం చేయాలని పట్టుబట్టడం… సంక్షేమ పథకాలపై సెటర్లు… అభివృద్ధి జరగలేదనే విమర్శలు… ఇవన్నీ గత అధికార వైసీపీ పార్టీకి కనెక్ట్ అయ్యే అంశాలుగా ఉన్నా… కథ పరంగా ఆ పార్టీని కెలికే ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం సీఎం మర్డర్ మిస్టరీ చుట్టూ పొలిటికల్ డ్రామా మాత్రమే చూపించారు. అక్కడక్కడా పొలిటికల్ సెటైర్లు వేయించినా.. సెన్సార్‌ బీప్‌లు చాలా చోట్ల ఉన్నాయి. ఈ సినిమా చాలా వరకూ టీవీ డిస్కషన్స్ బ్రేకింగ్ న్యూస్‌ ల చుట్టూ తిరగడంతో… చాలామందికి బోరింగ్ అనిపించే అవ‌కాశం ఉంది. అంతేకాదు ఎక్కువ‌గా సీన్లు వాస్తవ దూరంగా కూడా అనిపిస్తాయి.

Also Read : Demonte Colony 2: ఓటీటీ ప్రేక్షకులను తెగ భయపెడుతున్న ‘డీమాంటే కాలనీ 2’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com