డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తను ప్రభాస్ , శ్రుతీ హాసన్ , సంజయ్ దత్ తో కలిసి సలార్ తీశాడు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో యశ్ తో కేజీఎఫ్ తీశాడు. దీనికి కూడా సీక్వెల్ గా తీశాడు నీల్. అది కూడా బిగ్ సక్సెస్.
ప్రస్తుతం తను రిలీజ్ చేయబోయే సలార్ ఎలా ఉంటుందనే దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ తో సలార్ మరింత డార్కర్ గా ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మూవీ విడుదల తేదీని ఇప్పటికే ఖరారు చేశారు దర్శకుడు .
డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించాడు నీల్. తనకు జయాపజయాలపై నమ్మకం లేదని స్పష్టం చేశాడు. సినిమా అన్నది అత్యంత పవర్ ఫుల్ మాధ్యమం. దానిని ఎలా ఉపయోగించు కోవాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంద్నాడు దర్శకుడు.
కథ ముఖ్యం. ఇక హీరో హీరోయిన్ల గురించి ఎక్కువగా చెప్పేందుకు ఏముంటుందని తిరిగి ప్రశ్నించాడు ప్రశాంత్ నీల్. ఏది ఏమైనా ఇప్పటికే రికార్డు స్థాయిలో సలార్ టికెట్స్ అమ్ముడు పోయాయి.