Prasanth Varma:ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జా, అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో దిగిన ‘హనుమాన్’ సినిమా… పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీనితో ప్రశాంత్ వర్మ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ‘హనుమాన్’తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ప్రశాంత్ వర్మ సీక్వెల్ ‘జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నట్లు ప్రకటించారు. శ్రీరామ నవమి రోజున సినిమా పోస్టర్‌ని విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ, బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నారు.
Prasanth Varma:
ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఔత్సాహిక యువకులను భాగస్వామ్యం చేసేందకు దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆహ్వానించారు. యువకులు, ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం. “కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్, సూపర్ పవర్స్ మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి ? కథలు రూపొందించే నేర్పు, ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్, మార్కెటింగ్ మేవెన్.. మీ కళాత్మక నైపుణ్యాలతో యూనివర్స్ లోకి ప్రవేశించాలా ? మీ పోర్ట్‌ఫోలియోలను మాకు చేరవేయడానికి “talent@thepvcu.com”కి పంపండి! అంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి పనిచేయడానికి ఔత్సాహికులు తమ యొక్క ట్యాలెంట్ ను ప్రదర్శించడానికి సిద్ధపడుతున్నారు.