Prasanth Varma: చిన్న సినిమాగా 2024 సంక్రాంతి బరిలో దిగి… పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘హను-మాన్’. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఈ సినిమా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు సాధించి… దాదాపు అన్ని ఇండస్ట్రీలను తనవైపు చూసేలా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దీనిని తెరకెక్కించారు. దీనితో హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్‌వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. రానున్న ఇరవయ్యేళ్లూ ఈ ప్రపంచం చుట్టూ సినిమాల్ని తెరకెక్కించాలనేది ఆయన ప్రణాళిక. ఇందులో భాగంగానే త్వరలోనే ఆయన బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో జట్టు కట్టనున్నారు.
Prasanth Varma Movies
ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా సినిమా దాదాపు ఖాయమైనట్టే. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ కలయికలో సినిమాకి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. దీని తర్వాత ‘హను-మాన్’కి కొనసాగింపు ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. దీనితో ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయారు.
Also Read : Trisha Krishnan: రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న త్రిష ‘ఐడెంటిటీ’