Prasanth Varma : బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ డెబ్యూని బాలయ్య చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే.అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు అయ్యింది పరిస్థితి. వాస్తవానికి మోక్షజ్ఞ తొలి చిత్రం ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో ఉండబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.గురువారమే ఈ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ కార్యక్రమం ఆగిపోవడానికి మొదట ఆరోగ్య కారణాలు అని చెప్పిన, తర్వాత ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
Prasanth Varma-Mokshagna Movie..
చివరి నిమిషంలో ఈ ముహూర్తం వాయిదా పడటానికి కారణం మోక్షజ్ఞ అనారోగ్యానికి గురికావడమే అని చిత్ర పీఆర్వోలు తెలుపుతున్నారు. మోక్షజ్ఞ జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే ఈ మూవీ ప్రారంభోత్సవాన్ని మరొక రోజుకు వాయిదా వేసినట్లుగా వారు ప్రకటించారు. కానీ.. ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ ని షెల్వ్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రశాంత్ వర్మకి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రశాంత్ వర్మ సినిమేటిక్ యూనివర్స్, జై హనుమాన్, అధీర, ప్రభాస్ సినిమా ఇలా పలు ప్రాజెక్ట్స్ ఆయన చేయాల్సి ఉండటంతో ఈ సినిమా విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
అయినా బాలకృష్ణ స్పెషల్ రిక్వెస్ట్‌తో ప్రశాంత్.. మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేశాడు. కానీ.. చివరికి ఏమవుతుందో తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ వేడుకకు ఏపీ మినిస్టర్, బాలయ్య అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడనేలా ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో మోక్షజ్ఞ లేకుండా అయినా మూవీని ప్రారంభించవచ్చు. కానీ అలా చేయకుండా వాయిదా వేయడంపై నెటిజన్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞ.. వెంకీ అట్లూరి, ఆదిత్య 999 ప్రాజెక్టులకి ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
Also Read : The Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్ కు ‘ది రాజా సాబ్’ నుంచి చిన్న డిష్ అపాయింట్మెంట్