Prakash Raj : విలక్షన నటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ చేస్తున్న పోస్టు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వరుసల ట్వీట్లతో పవన్‌ను ఆయన ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను ఉద్దేశించి ఆయన వరుస పోస్టులు చేస్తూనే ఉన్నారు. తాజాగా కార్తికి పవన్‌కు క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్…’ అని పేర్కొన్నారు. అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ చర్చనీయాంశమైంది.
Prakash Raj Tweet
“గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం?’’ అని ప్రకాశ్‌రాజ్(Prakash Raj) గురువారం ట్వీట్ చేశారు. ఇది కూడా కల్యాణ్‌ను ఉద్దేశించే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ప్రాయశ్చిత దీక్షలో భాగంఆ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హిందూ ఽధర్మాన్ని కించపరిచేలా మాట్లాడేవారి గురించి స్పందించిన విషయం తెలిసిందే. అందులో ప్రకాశ్‌రాజ్ పోస్టులపై అసహనం వ్యక్తం చేశారు. సున్నితాంశాలపై ప్రకాశ్‌రాజ్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాశ్‌రాజ్ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేేస ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని పేర్కొన్నారు.
Also Read : Jayam Ravi : డేటింగ్ వార్తలపై స్పందించిన సింగర్