Prakash Raj : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల పై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కన్నేసంది. దానిని వేలం పాటకు పెట్టింది. ఇది పూర్తిగా తమదేనంటోంది. చిలుక పలుకులు పలుకుతోందంటూ మండిపడ్డాడు. ప్రకాశ్ రాజ్(Prakash Raj) తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమస్యపై స్పందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సేవ్ హెచ్ సీ యూ అంటూ హ్యాష్ టాగ్ సంచలనంగా మారింది.
Prakash Raj Shocking Comments on HCU Land Issue
వన్య ప్రాణుల ఆక్రందనలు పట్టించుకోకుండా పచ్చని అడవిని జేసీబీలతో నేలమట్టం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా డోంట్ కేర్ అంటున్నారు. ఈ సందర్భంగా సీరియస్ గా స్పందించారు ప్రకాశ్ రాజ్(Prakash Raj). ఆక్షన్ వద్దు ఆక్సిజన్ కావాలని, ప్రభుత్వం అనేది ప్రజలకు ప్రయోజనకారిగా ఉండాలే తప్పా భారంగా మారకూడదంటూ సూచించారు. ఈ విధ్వంసం ఎంత మాత్రం మంచిది కాదు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థుల పోరాటపటిమను గౌరవిస్తున్నానని అన్నారు. మనందరి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కలిసి రావాలని పిలుపునిచ్చారు ప్రకాశ్ రాజ్.
మరో వైపు ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా మరో కీలక నటి రేణు దేశాయ్ నిలవడం విశేషం. ఆమె కూడా హెచ్ సీ యూ భూముల వేలాన్ని తప్పు పట్టారు. భవిష్యత్తులో అడవులంటూ లేకుండా పోతే ఎలా ఆక్సిజన్ అందుతుందంటూ ప్రశ్నించింది. ఇది మంచి పద్దతి కాదంటూ పేర్కొంది. తను చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే యూనివర్శిటీ క్యాంపస్ లో ఒక్క దుప్పి కూడా లేదని సీఎం చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఇదే ప్రాంగణంలో దుప్పుల మంద ఉరుకుతున్న వీడియోను తనే స్వయంగా షేర్ చేసింది. జీవాలనే కాదు కోటి 20 లక్షల మంది ఊపిరి తీసే ప్రయత్నం చేస్తున్నారంటూ వాపోయింది.
Also Read : Actor Priyadarshi Sensational :కల నెరవేరింది సంతోషం మిగిలింది