Prakash Raj : బెట్టింగ్ యాప్స్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (ఈడీ) గుర్తించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉక్కు పాదం మోపారు. 11 మంది యూట్యూటర్లతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీ నటులపై కేసులు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు. కేసులు నమోదైన వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్(Prakash Raj), నిధి అగర్వాల్, శ్రీముఖి, మంచు లక్ష్మితో పాటు మొత్తం 25 మందికి పైగా కేసులు నమోదు కావడం విస్తు పోయేలా చేసింది.
Prakash Raj Shocking Comments
ఇదే సమయంలో నటి విష్ణుప్రియ, యూట్యూబర్ రీతూ చౌదరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తాను 15కు పైగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని ఒప్పుకుంది విష్ణుప్రియ. భారీ ఎత్తున డబ్బులు వెనకేసుకున్నట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ స్పందించింది. వెంటనే కేసుకు సంబంధించిన వివరాలను తెలియ చేయాల్సిందిగా ఆదేశించింది పోలీసులను. దీని వెనుక మనీ లాండరింగ్ జరిగి ఉంటుందనే కోణంలో ఆరా తీస్తోంది.
దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుపై స్పందించారు వివాదాస్పద నటుడు ప్రకాశ్ రాజ్. ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎనిమిది సంవత్సరాల కిందట ప్రమోషన్ చేసిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే ఇది మంచిది కాదని తాను తర్వాత తెలుసుకున్నానని, వెంటనే విరమించుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు ప్రకాశ్ రాజ్.
Also Read : Tollywood Actors-Case Sensational :టాలీవుడ్ నటులపై చర్యలు తప్పవు