Pragathi: టాటూ సీక్రెట్ ను బయటపెట్టిన నటి ప్రగతి

టాటూ సీక్రెట్ ను బయటపెట్టిన నటి ప్రగతి

Hello Telugu - Pragathi

Pragathi: ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నటి ప్రగతి. మంచి కామెడీ టైమింగ్ తో పాటు అమ్మ, వదిన లాంటి డీసెంట్ క్యారెక్టర్ట్స్ తో ప్రేక్షకులకు దగ్గరైన ప్రగతి… ఇటీవల బెంగుళూరులో జరిగిన 28వ నేషనల్‌ లెవల్ పవర్‌ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ లో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. సినిమాలో నటిస్తూనే ఫిట్ నెస్ లో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ప్రగతి… ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తన జీవితంకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

Pragathi – ఆర్ధిక కష్టాల నుండి సినిమా సెట్ లోనికి

చిన్ననాటి నుండే కష్టాలు ఎదుర్కొన్న ప్రగతి(Pragathi)… తల్లికి ఆర్ధిక సహాయం చేసేందుకు కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. ఆ తరువాత మైసూర్ సిల్క్ ప్యాలెస్ యాడ్స్ లో నటించి… ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా దర్శకత్వంలో ‘వీట్టులే విశేషం’ తమిళం నాట హీరోయిన్ గా అడుగుపెట్టింది. సుమారు ఎనిమిది సినిమాల్లో నటించిన తరువాత 20 ఏళ్ళకే పెళ్ళి చేసుకుంది. అయితే పెళ్ళి చేసుకున్న తరువాత హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో.. కాస్తా విరామం తీసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో భర్త నుండి విడాకులు తీసుకున్న ప్రగతి మరల 24వ ఏట నుండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది. అయితే హీరోయిన్ గా ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు… వాన పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్ లోని కొంతమంది వ్యక్తుల చూపులు తనను ఇబ్బంది కలిగించడంతో… సినిమాలకు స్వస్తి చెప్పాలని డిసైడ్ అయినట్లు ప్రగతి మనసులోని బాధను వ్యక్తం చేసింది.

వ్యాక్సిన్ మచ్చను కవర్ చేయడానికే టాటూ

సినిమాల్లో చాలా కూల్ గా, సంప్రదాయ బద్దంగా కనిపించే ప్రగతి… బయట మాత్రం ఈమె డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో జిమ్, డ్యాన్సులతో… ప్రగతి తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చింది. భుజాలపై టాటూలతో జిమ్ వర్కౌట్స్, డ్యాన్సులతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హట్ చల్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె భుజంపై ఉన్న టాటూ చూసి కామెంట్స్ చేసే అభిమానులకు దాని వెనుక ఉన్న సీక్రెట్ ను బయటపెట్టింది. చిన్నతనంలో తన భుజంపైన వేసిన వ్యాక్సిన్ సెప్టిక్ కావడంతో అక్కడ మచ్చ ఏర్పడింది. దీనితో ఆ మచ్చను కవర్ చేసేందుకే టాటూను వేసుకున్నట్లు నటి ప్రగతి క్లారిటీ ఇచ్చింది.

Also Read : Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ షూటింగ్ షురూ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com