Pradeep Ranganathan : డ్రాగన్ మూవీతో దుమ్ము రేపిన నటుడు ప్రదీప్ రంగనాథన్. తన తొలి చిత్రం లవ్ టుడేతో దుమ్ము రేపాడు. ఆ తర్వాత మారి ముత్తు దర్శకత్వం వహించిన తమిళ, తెలుగు చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేసింది. తమ తదుపరి మూవీ ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) తో ఉంటుందని. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరింత ఉత్కంఠ రేపేలా చేసింది. ఇప్పటికే మలయాళ నటిని ఎంపిక చేశారని, మరో వైపు అనూ ఇమ్మాన్యూయెల్ కూడా ప్రదీప్ రంగనాథన్ తో జత కట్టనుందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Pradeep Ranganathan-Vignesh Shivan Movie
స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి సుధా కొంగర వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇప్పటికే కథ కూడా చెప్పారని, దీనికి ప్రదీప్ రంగనాథన్ ఓకే చెప్పాడని , నటీ నటులు, సాంకేతిక బృందం కూడా ఎంపిక చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు టాక్. ఇక మారిముత్తు తీసిన డ్రాగన్ ను రూ. 30 కోట్లు ఖర్చవుతే విడుదలయ్యాక ఆ సినిమా ఏకంగా రూ. 150 కోట్లు వసూలు చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ ప్రముఖ నటి లేడి అమితాబ్ బచ్చన్ గా పేరు పొందిన నయన తార భర్త విగ్శేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఎల్ కే సినిమాలో బిజీగా ఉన్నాడు. దీనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేశాక తెలుగు మూవీలో నటించేందుకు రానున్నాడు. డ్రాగన్ బిగ్ సక్సెస్ కావడంతో తదుపరి రాబోయే ఎల్కే సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే మమిత బైజును ఎంపిక చేయగా టీవీ స్టార్ ఐశ్వర్య శర్మను కూడా ఎంపిక చేసినట్లు టాక్.
Also Read : Tamannaah Shocking :ఫ్యాషన్ అంటే పేషన్ అన్న తమన్నా