Pradeep Ranganathan : తమిళ సినీ నటుడు, దర్శకుడిగా మారిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తాజాగా లోఫర్ తో కలిసి నటించిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినీ వర్గాల అంచనాలను తలకిందులు చేసింది. రికార్డు బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. విడుదలైన అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సత్తా చాటింది.
Pradeep Ranganathan Comments
ప్రత్యేకించి హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన జీవితంలో ముందు లఘు చిత్రాలతో మొదలు పెట్టి ఆ తర్వాత లవ్ టుడేతో చరిత్ర సృష్టించి..డ్రాగన్ తో ఎవడ్రా వీడు అనేంతగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. ఈ ఒక్క మూవీ ఇప్పుడు టాప్ హీరోలనే కాదు దర్శకులను సైతం విస్మయానికి గురి చేసింది.
డ్రాగన్ ను తమిళంతో పాటు తెలుగు వెర్షన్ లో విడుదల చేశారు. తొలి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పరుగులు తీస్తోంది. ఏకంగా తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే. ఏకంగా రూ. 60 కోట్లకు పైగా వసూలు చేసినట్లు టాక్.
ఈ సందర్బంగా చిట్ చాట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. తన జీవితంలో జరిగిన సంఘటనలే తాను నటించే , తీసే సినిమాలంటూ ప్రకటించాడు. ప్రస్తుతం తను చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : Preity Zinta Shocking :ఎంపీ సీటు ఆఫర్ ను తిరస్కరించా