Dragon : మారి ముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాతు లోహర్ కలిసి నటించిన డ్రాగన్ సంచలనం సృష్టించింది. బాక్సులు బద్దలు కొట్టింది . అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దుమ్ము రేపింది. కాసులు కురిపించేలా చేసింది. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఇటు తమిళంలో ఇటు తెలుగులో భారీ ఆదరణను చూరగొంది. ఏకంగా రూ. 130 కోట్లను వసూలు చేసి సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఈ ఏడాది వచ్చిన సినిమాలలో డ్రాగన్(Dragon) తో పాటు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కోర్ట్ కూడా సక్సెస్ అయ్యింది.
Dragon Sensational on OTT
దీనిని ప్రముఖ నటుడు నాని నిర్మాణ సారథ్యంలో రిలీజ్ చేశాడు. దీనిని ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 8 కోట్లకు తీసుకుంది. ఇదే సమయంలో ఓటీటీలో విడుదలైన సినిమాలలో అత్యధిక వ్యూయర్షిప్ తో దూసుకు పోతోంది ప్రదీప్ రంగనాథన్, లోహర్ డ్రాగన్ చిత్రం. టాప్ 3 మూవీస్ లలో ఉన్న నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రాన్ని దాటేసింది. అరుదైన రికార్డ్ బ్రేక్ సాధించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం విశేషం.
విచిత్రం ఏమిటంటే అద్భుతంగా సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు మారిముత్తు. కామెడీ, లవ్, డ్రామా, యాక్షన్ ప్రధాన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్రాగన్ థియేటర్లలో హల్ చల్ చేస్తుంటే ఇంకో వైపు ఓటీటీలో కూడా దుమ్ము రేపుతుండడం విస్తు పోయేలా చేసింది. ఏది ఏమైనా నటుడు, రచయిత, దర్శకుడిగా పేరు పొందిన ప్రదీప్ రంగనాథన్ కు ఈ మూవీ మరిచి పోలేని చిత్రంగా మిగిలి పోతుందనడంలో సందేహం లేదు.
Also Read : Hari Hara Veera Mallu Excitement :పవన్ హరి హర వీరమల్లుపై ఉత్కంఠ