Pradeep Machiraju : యాంకర్ ప్రదీప్ బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అమ్మాయిలు, యూత్‌లోను కల్ట్ ఫాలోయింగ్ సాధించాడు. స్మాల్ స్క్రీన్‌పై షోస్ చేస్తూనే.. సిల్వర్ స్క్రీన్‌పై అడపాదడపా క్యారెక్టర్స్ చేశాడు. 2021లో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసి పర్వాలేదనిపించాడు. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నా అభిమానులకి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ మధ్యకాలంలో షోస్ కూడా తగ్గించాడు. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అలాగే ఈ సినిమాకి ఓ ‘పవన్ కళ్యాణ్’ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది.
Pradeep Machiraju Movie Upates
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. టైటిల్ ఏంటంటే..ప్రదీప్(Pradeep Machiraju) తన మొదటి సినిమాతోనే విభిన్నమైన స్టోరీతో ఆకట్టుకున్నాడు. ‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా వచ్చి నాలుగేళ్ళ అయిన నెక్స్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. తాజాగా తెలుగు కామెడీ షో ‘జబ్బర్దస్త్’ డైరెక్టర్స్ నితిన్, భరత్‌ల దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కూడా విభిన్నమైన లవ్ స్టోరీతో పాటు కామెడీ ట్రాక్ కలిగి ఉంటుందని ఇండస్ట్రీ లీక్. ఇక ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammai Ekkada Abbayi)’టైటిల్ ని ఓకే చేశారు. దీంతో ఆడియెన్స్ వీపరీతమైన బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీపికా పిల్లి ప్రదీప్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మాంక్స్ & మంకీస్ నిర్మిస్తున్నారు. ఇక గ్రీన్ బ్యాక్ డ్రాప్ లో ప్రదీప్(Pradeep Machiraju), దీపిక కళ్లలోకి చూస్తూ కనిపించిన ఫస్ట్ లుక్ వారి డాజ్లింగ్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తోంది. మోషన్ వీడియోలో విలేజ్ లో గందరగోళ పరిస్థితి మధ్య ప్రదీప్ ఇంటి నుంచి దీపిక ఇంటికి ఫైర్‌ఫ్లై ప్రయాణించే బ్యూటీఫుల్ సీన్ ని ప్రజెంట్ చేస్తోంది, ఇదొక ప్లజంట్ లవ్ స్టొరీని సూచిస్తుంది. ప్లాట్‌లైన్‌కి వస్తే- ఒక సివిల్ ఇంజనీర్ వర్క్ కోసం ఒక గ్రామంలోకి వస్తారు, అక్కడ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య ఎంటర్ టైనింగ్ ప్రేమకథ, లాఫ్ లౌడ్ మూమెంట్స్, ఊహించని మలుపులు, సర్ ప్రైజింగ్ ప్రేమ కథగా వుండబోతోంది.
ఈ చిత్రంలో ప్రముఖ హాస్యనటులు వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ అండ్ ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. ప్రదీప్ మొదటి సినిమా మ్యూజికల్ హిట్, ఈ సినిమాలో కూడా మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ వుంది. దీంతో, మేకర్స్ ట్యాలంటెడ్ కంపోజర్ రధన్‌ను ఎంపిక చేశారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్. ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ వీడియో సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. దీంతో ప్రదీప్ కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ నిరీక్షణ తీరినట్లే.
Also Read : Nidhhi Agerwal : ఒకే రోజు రెండు సినిమాలతో రానున్న హీరోయిన్ నిధి అగర్వాల్’