Prabhutva Juniour Kalasala: ఓటీటీలోకి టీనేజీ ప్రేమకథ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ !

ఓటీటీలోకి టీనేజీ ప్రేమకథ 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' !

Hello Telugu - Prabhutva Juniour Kalasala

Prabhutva Juniour Kalasala: తెలుగు సినిమాల్లో టీనేజీ ప్రేమకథలు బోలెడు. ‘కొత్త బంగారు లోకం’ నుంచి ‘బేబి’ వరకు చాలా మూవీస్ వచ్చాయి. ఈ తరహా స్టోరీతోనే వచ్చిన మరో మూవీ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల(Prabhutva Juniour Kalasala)’. ప్రణవ్‌ సింగంపల్లి, షగ్న శ్రీ వేణున్‌ జంటగా శ్రీనాథ్‌ పులకురం దర్శకత్వంలో భువన్‌ రెడ్డి కొవ్వూరి ఈ ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల’ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ ‘కల్కి’ థియేటర్లలో రిలీజ్ కావడానికి వారం ముందు వచ్చింది. హడావుడిలో ఇదొకటుందనే ఎవరూ పట్టించుకోలేదు. ఓ మాదిరిగా పర్లేదనిపించింది. ఇప్పుడిది ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

Prabhutva Juniour Kalasala Movie OTT Updates

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా లో ప్రస్తుతం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల(Prabhutva Juniour Kalasala)’ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్ట‍ర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గతంలో వచ్చిన చాలా తెలుగు సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. సీన్లు కూడా అరె ఎక్కడో చూశామే అనిపించేలా ఉంటాయి. కాకపోతే చూస్తున్నంతసేపు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే టైమ్ పాస్ అయిపోతుంది.

ఇక’ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమా కథ విషయానికొస్తే… 2004లో రాయలసీమలో పుంగనూరు అనే ఊరు. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్ కుర్రాడు వాసు (ప్రణవ్ ప్రీతమ్). అదే కాలేజీలో సీఈసీ చదువుతున్న కుమారి (శాగ్నశ్రీ వేణున్) అనే అమ్మాయి. అసలు పరిచయమే లేని వీళ్లిద్దరూ అనుకోని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమలో పడతారు. కానీ కుమారి గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతో గొడవపడతాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. వాసు ఎందుకు చనిపోవాలనుకున్నాడు? చివరకు వీళ్ల ప్రేమ కంచికి చేరిందా? అనేదే స్టోరీ.

తొలి ప్రేమ.. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం. అయితే అది మంచి జ్ఞాపకమా? చేదు జ్ఞాపకమా అనేది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల(Prabhutva Juniour Kalasala)’ కూడా అలాంటి ఓ స్టోరీనే. ఇంటర్మీడియట్ చదివే కుర్రాడి జీవితంలో తొలి ప్రేమ అనేది తీపి గుర్తుల్ని మిగిల్చిందా? చేదు అనుభవాల్ని పరిచయం చేసిందా అనేదే మెయిన్ పాయింట్.

ఫస్టాప్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజీలో వాసు, అతడి ఫ్రెండ్స్, చుట్టూ ఉండే వాతావరణం, కుమారితో ప్రేమ లాంటివి చూపిస్తూ వెళ్లారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి ప్రేమలో కలతలు, మనస్పర్థలు లాంటివి ఉంటాయి. ఇందులో చెప్పుకోవడానికి కథేం కొత్తగా ఉండదు. ఇప్పటికే ఎన్నో కాలేజీ లవ్ స్టోరీల్లో కనిపించే సీన్స్ ఉంటాయి. కానీ అంతా కూడా మలయాళ సినిమాల్లో తీసినట్లు చాలా నిదానంగా అదే టైంలో క్యూట్‌గా సాగుతుంది. 90ల్లో పుట్టి పెరిగిన వాళ్లు ఈ సినిమా చూస్తే.. గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. తొలి ప్రేమ, తొలి ముద్దు లాంటివి మనసులో గిలిగింతలు పెట్టేస్తాయి. పాత ప్రేమలు మళ్లీ గుర్తొస్తాయి.

Also Read : Purushothamudu: ఓటీటీలోనికి రాజ్‌ తరుణ్‌ ‘పురుషోత్తముడు’ ! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com