Prabhas-Trisha : 16 ఏళ్ల తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో త్రిష జోడి కట్టనుందా..?

ఆమెకు ఇప్పటికీ హీరోయిన్ పాత్రలకు డిమాండ్ ఉంది. స్టార్ నటీనటులతోనూ ఈ సౌత్ క్వీన్ జోడీ కడుతోంది...

Hello Telugu - Prabhas-Trisha

Prabhas-Trisha : యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో కొత్త సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. అయితే టీమ్ నుండి అధికారిక సమాచారం రాకముందే, స్పిరిట్ సినిమాపై కొన్ని పుకార్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. అందులో ఒకటి.. ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా త్రిష కృష్ణన్ నటిస్తుందని అంటున్నారు. నటి త్రిష కృష్ణన్ గత 2 దశాబ్దాలుగా హీరోయిన్ గా రాణిస్తోంది.

ఆమెకు ఇప్పటికీ హీరోయిన్ పాత్రలకు డిమాండ్ ఉంది. స్టార్ నటీనటులతోనూ ఈ సౌత్ క్వీన్ జోడీ కడుతోంది. ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ త్రిషతో చర్చలు జరుపుతున్నట్లు కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ప్రభాస్(Prabhas) ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘ కల్కి 2898 AD’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలను అంగీకరిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ‘ ది రాజా సాబ్’ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేతులు కలిపిన ‘స్పిరిట్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Prabhas-Trisha Movies Update

అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్‌’, ‘యానిమల్‌’ సినిమాల ద్వారా సందీప్‌ రెడ్డి వంగ తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన సినిమాల్లో మహిళల పాత్రను కించపరిచేలా చూపించారనే విమర్శలున్నాయి. యానిమల్’ విడుదలైనప్పుడు చాలా ప్రతికూల వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయడానికి త్రిష(Trisha) ఒప్పుకుంటుందా అనే అనుమానాలు చాలానే ఉన్నాయి. ఇక వెండితెరపై ప్రభాస్- త్రిషలది హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరు వర్షం, బుజ్జిగాడు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించాయి. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో మళ్లీ ప్రభాస్- త్రిష జత కడితే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read : Bangladesh Hero : బంగ్లాదేశ్ యంగ్ హీరోను కొట్టి చంపిన చిల్లర మూకలు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com