The Raja Saab : పాన్ ఇండియా హీరో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. తను ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి-2తో పాటు యానిమల్ మూవీతో దుమ్ము రేపిన డైనమిక్ స్టార్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డితో కమిట్ అయ్యాడు. తనతో కలిసి స్పిరిట్ గా వస్తున్నాడు. ఇప్పటికే జస్ట్ పోస్టర్ లుక్ రిలీజ్ చేశాడు వంగా. దీంతో ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగేలా చేశాడు.
The Raja Saab Release Delay..
తను ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశాడంటే ఇక దానిపై ఎక్కువగా ఫోకస్ ఉండేలా చేస్తాడు. తన రూటే సపరేట్. సినిమా మీద ఉన్న పేషన్ తో ఎన్నో కష్టాలు పడ్డాడు. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ తీశాడు. ఆ తర్వాత ఇదే చిత్రాన్ని షాహీద్ కపూర్ తో హిందీలో తీస్తే అది కూడా హిట్టే.
ఎవరూ ఊహించని రీతిలో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికతో యానిమల్ తీశాడు. ఇది రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఇప్పుడు ఫుల్ ఫోకస్ అంతా ప్రభాస్ పై పెట్టాడు. తన తదుపరి చిత్రం మహేష్ బాబు తో ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు. ప్రస్తుతం ప్రిన్స్ ఎస్ఎస్ రాజమౌళితో ఫిక్స్ అయి పోయాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు రాజా సాబ్(The Raja Saab) కోసం. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీకి.
ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కాగా సినీ వర్గాల ప్రకారం ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని, ఈ ఏడాదిలో రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పాటలు షూట్ చేయాల్సి ఉందని సమాచారం. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇబ్బందుల్లో ఉందని అందుకే సినిమా లేట్ అవుతోందని జోరుగా ప్రచారం ఊపందుకుంది. ఇంకా ఎడిట్ చేయాల్సి ఉండడంతో రాజా సాబ్ ఆలస్యం కాక తప్పదంటున్నారు.
Also Read : Hero Yash : భార్య రాధిక కోసం పాట పాడిన యష్