Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీనితో మిగిలిన భాషల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలుగులో విడుదలైన చిత్రాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చి మంచి వసూళ్లు రాబట్టాయి. స్టార్ హీరోల పెద్ద చిత్రాల నుంచి చిన్న సినిమాలు, ఒకప్పుడు డిజాస్టర్స్ అయిన సినిమాలు కూడా మళ్లీ విడుదలై విజయాన్ని అందుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ నటించిన అన్ని చిత్రాలు మరోసారి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీస్ రీరిలీజ్ రూపంలో ప్రేక్షకులను మరోసారి అలరించాయి.
Prabhas Movies..
ఇక ఇప్పుడు ప్రభాస్(Prabhas) కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ అయిన చక్రం సినిమా రీరిలీజ్ కోసం రెడీ అయ్యారు మేకర్స్. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో డార్లింగ్ నటించిన చిత్రం చక్రం. 2005లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అప్పటి మాస్, యాక్షన్ హీరోగా అలరించిన ప్రభాస్.. ఈ మూవీలో పూర్తిగా సాఫ్ట్ రోల్ పోషించడం.. అలాగే చివరకు హీరో చనిపోవడంతో ఈ సినిమా అప్పట్లో హిట్ కాలేకపోయింది.
ఇందులో ఆసిన్, ఛార్మీ హీరోయిన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ఊర్వశి, వేణు మాధవ్, రఘుబాబు కీలకపాత్ర పోషించారు. కమర్షియల్ గా ఈ సినిమా ఫెయిల్ అయినా.. ఇందులోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా మరోసారి అడియన్స్ ముందుకు రానుంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జూన్ 8న రిలీజ్ కాబోతుంది. ఆదివారం రీరిలీజ్ ట్రైలర్ విడుదల చేయడంతోపాటు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ ఈ మూవీ స్క్రీనింగ్స్ ఉండటం స్పెషల్ గానూ ఉంది.
Also Read : Mahesh Babu : సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కీలక అప్డేట్ ఇచ్చిన రాజమౌళి మూవీ టీమ్