Raja Saab : పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుడిగా గుర్తింపు పొందాడు. బాలీవుడ్ స్టార్స్ ను తలదన్ని నెంబర్ వన్ గా నిలిచాడు. నాగ్ అశ్విన్ తీసిన కల్కితో మరో రికార్డ్ సృష్టించాడు.
Hero Prabhas-Raja Saab Release Updates
ప్రస్తుతం యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పూర్తిగా రొమాంటిక్ ప్రధాన పాత్రలో రాజా సాబ్(Raja Saab) చిత్రంలో నటిస్తున్నాడు. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ తర్వాత పూర్తిగా లవర్ బాయ్ గా ప్రభాస్ నటిస్తుండడం విశేషం.
కాగా డార్లింగ్ చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని, పోస్ట్ ప్రొడక్షన్ త్వరితగతిన పూర్తి చేసి రాబోయే వేసవి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు దర్శక, నిర్మాతలు మారుతి, విశ్వ ప్రసాద్.
దీంతో పండుగ చేసుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్ నటిస్తుండగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. మొత్తంగా రొమాంటిక్ రాజా సాబ్ పై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Hero Bunny-Pushpa 2 : మరో కొత్త స్ట్రాటజీతో రానున్న ‘పుష్ప 2’ టీమ్