సినీ రంగానికి సంబంధించి డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గతంలో ఎన్నో చిత్రాలలో నటించినా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి మూవీ రికార్డుల మోత మోగించింది. రికార్డు బ్రేక్ చేసింది. ఈ సినిమా ఆశించిన దానికంటే సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా తీశాడు దర్శకుడు. అది కూడా హిట్ గా నిలిచింది.
ఇక ఆ తర్వాత నటించిన సినిమాలు ఆశించిన విధంగా ఆడలేదు. ఇదే సమయంలో ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ త్వరలోనే విడుదల కానుంది. దీని దెబ్బకు షారుక్ ఖాన్ నటించిన మూవీ విడుదల తేదీని వాయిదా వేశారు.
ఇదంతా పక్కన పెడితే ఊహించని రీతిలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఇన్ స్టా గ్రామ్ లో ఖాతా కనిపించకుండా పోయింది. ఈ ఖాతా సస్పెండ్ చేయబడింది. ఎందుకు తొలగించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేకించి సినీ రంగానికి చెందిన ప్రముఖలంతా సామాజిక మాధ్యమాలలో ఖాతాలు ఉన్నాయి.
తమ అభిప్రాయాలను పంచుకోవడం, తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందజేస్తూ వస్తారు. ఇన్ స్టాలో టాప్ లో కొనసాగుతున్న వారిలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే ఉన్నారు.