Prabhas: ఘనంగా ‘కల్కి 2898 AD’ టీజర్ రిలీజ్ ఈవెంట్ ! అదరగొట్టిన ప్రభాస్ ఎంట్రీ !

ఘనంగా ‘కల్కి 2898 AD’ టీజర్ రిలీజ్ ఈవెంట్ ! అదరగొట్టిన ప్రభాస్ ఎంట్రీ !

Hello Telugu - Prabhas

Prabhas: వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్‌ 27న సినిమాని విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లను చిత్ర యూనిట్ షురూ చేసింది. దీనిలో భాగంగా ‘కల్కి 2898 AD’ సినిమాకు సంబంధించి బుజ్జి, భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ బుధవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్(Prabhas)… సినిమాలో బుజ్జి పాత్రకు సంబంధించిన ప్రత్యేక వాహనాన్ని నడుపుకుంటూ వేదిక మధ్యలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. ప్రస్తుతం ప్రభాస్ ఎంట్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరోవైపు ‘కల్కి 2898 AD’ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.

Prabhas Kalki Updates

ఈ సందర్భంగా హీరో ప్రభాస్(Prabhas) మాట్లాడుతూ… ‘‘హాయ్‌ డార్లింగ్స్‌.. ఎలా ఉంది బుజ్జి, భైరవ గ్లింప్స్‌. ఎంజాయ్‌ చేశారా?. బుజ్జితో కలిసి భైరవ చేసిన ప్రయాణం ఎంతో ఆసక్తికరం. ఈ పాత్రలతో మూడేళ్లు ప్రయాణం చేశా. అమితాబ్‌… కమల్‌ హాసన్‌ నటనని చూసి భారతదేశం స్ఫూర్తి పొందింది. అలాంటి గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. అమితాబ్‌ బచ్చన్‌ లాంటి నటుడు మన దేశంలో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఆయన స్ఫూర్తితోనే వచ్చాం మేమంతా. నా చిన్నప్పుడు కమల్‌ హాసన్‌ సర్‌ నటించిన ‘సాగరసంగమం’ చూసి అలాంటి దుస్తులు కావాలని మా అమ్మని అడిగి తెప్పించుకున్నా.

ఇందులో ఉన్న మరో అందమైన స్టార్‌ దీపికా పదుకొణె. ఆమెతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. దిశా పటానీని హాట్‌ స్టార్‌ అంటుంటారు మా నిర్మాత స్వప్నదత్‌. నిర్మాత అశ్వనీదత్‌ ఈ వయసులోనూ శ్రమించే విధానం చూసి ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. ఇంత ఖరీదైన సినిమా తీస్తూ కూడా, ఇంకా ఏం చేద్దాం అని అడుగుతుంటారు. ఇంత భారీ సినిమాలు తీస్తూ, ఇన్నేళ్లు పరిశ్రమలో ఉన్నది ఆయనొక్కరేనేమో. తన రెండో సినిమానే ఎన్టీఆర్‌తో చేశారంటే ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. అంతే ధైర్యం, తపనతో పనిచేస్తుంటారు ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక. వాళ్లకీ, బుజ్జిని పరిచయం చేస్తున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు.

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ… ‘‘పేరు చిన్నదే కానీ, సినిమాలో బుజ్జి మామూలుగా ఉండదు. సినిమా తీయడమే కష్టంజ ఈ సినిమా కోసం ఇంజినీరింగ్‌ కూడా చేయాల్సి వచ్చింది. భవిష్యత్తు కారు నేపథ్యంలో సినిమా అన్నప్పుడు డిజైన్‌ గురించి తర్జన భర్జన పడ్డాం. మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాకు ట్వీట్‌ చేశాక, ఆయన తన బృందాన్ని మాకు పరిచయం చేశారు. వాళ్లంతా చాలా సహకారం అందించారన్నారు. నిర్మాత సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ ‘‘ఇది విడుదల తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Payal Rajput: క్రిమినల్స్ కు పాయ‌ల్ రాజ్‌పుత్‌ స్ట్రాంగ్ వార్నింగ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com