Prabhas : ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రస్తుతం ఆయన ఫౌజి, ది రాజా సాబ్, కన్నప్ప పాన్ ఇండియా సినిమాలతో షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఇప్పుడిప్పుడు ఆయన పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపించటం లేదు. కానీ ప్రభాస్ లేదా అతని ఫ్యామిలీలో ఎవరు కనిపించిన మీడియా ప్రభాస్(Prabhas) పెళ్లి గురించి పదే పదే ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెద్దమ్మ, లెజండరీ యాక్టర్ కృష్ణం రాజు భార్యని మీడియా ప్రశ్నించగా. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Prabhas Marriage Updates
ఆమె ఏం చెప్పిందంటే..నవరాత్రి ఉత్సాహాల్లో భాగంగా ప్రభాస్(Prabhas) పెద్దమ్మ, కృష్ణం రాజు భార్య శ్యామల దేవి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ఛానెల్ ప్రభాస్ పెళ్ళికి సంబంధించి ప్రశ్న అడగగా ఆమె సమాధానమిస్తూ.. “దీర్ఘ కాలం నుండి వేచి చూస్తున్న పెళ్ళికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతుంది. పైనున్న కృష్ణం రాజు గారు అన్ని సవ్యంగా చూసుకుంటారు. ఇప్పటి వరకు అనుకున్నావని అనుకున్నట్లే అయ్యాయి. మా కుటుంబం మొత్తం ప్రభాస్(Prabhas) ఎప్పుడెప్పుడు ఒక్కింటి వాడవుతాడా అంటూ వెయిట్ చేస్తున్నాము” అన్నారు. అలాగే పెళ్లి కూతురేవారు అని ప్రశ్నడగగా ఆమె సమాధానం దాటవేశారు. దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరోవైపు ప్రభాస్ మాత్రం కల్కి 2898AD ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు.. “నేను పెళ్లి చేసుకొని నా ఫీమేల్ ఫ్యాన్స్ మనుసుళ్ళని గాయపరచడం ఇష్టం లేదన్నారు”.
ప్రభాస్ మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్ 2, రాజాసాబ్, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడితో ఓ చిత్రం ఉన్నాయి. ఒక్కో షూటింగ్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’తో చిత్రీకరణ పరుగులు పెట్టిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరో, కథానాయికలు, కొద్దిమంది హాస్యనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో టి.జి.విశ్వప్రస?ద్ నిర్మిస్తున్న చిత్రమిది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌తోపాటు మరో కథానాయిక ఇందులో నటిస్తోంది. హారర్ అంశాలతో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో అలరించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌తో ఆకట్టుకున్నారు. విజువల్‌గా మరింత అద్భుతంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Rajinikanth-Fahad : ఫహద్ ఫాసిల్ నటనకు ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్ రజినీకాంత్