పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు ఇవాళ. ఆయనకు 43 ఏళ్లు. ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అయ్యాడు. పలు సినిమాలలో కీలక రోల్స్ చేశాడు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్య నారాయణ ప్రభాస్ రాజు. 23, అక్టోబర్ 1979లో పుట్టాడు. 2002 లో సినిమా రంగంలో ఎంటర్ అయ్యాడు. పేరెంట్స్ సూర్య నారాయణ రాజు, శివకుమారి.
తన బాబాయి కృష్ణంరాజు పేరు పొందిన నటుడు. ప్రభాస్ ఈశ్వర్ మూవీతో మొదలు పెట్టాడు తన సినీ కెరీర్ ను. ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, భిల్లా , డార్లింగ్ , మిస్టర్ పర్ ఫెక్ట్ , మిర్చి, బాహు బలి, బాహు బలి -2 , ఆది పురుష్ చిత్రాలలో నటించాడు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ రిలీజ్ అయ్యింది. ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు ప్రముఖ నిర్మాతగా ఉన్నారు. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామం. పాన్ ఇండియా హీరో బీటెక్ వరకు చదువుకున్నారు.
ఛత్రపతి మూవీకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఇది బిగ్ సక్సెస్ గా నిలిచింది. ఇదే దర్శకుడు దర్శకత్వం వహించిన బాహు బలి రికార్డుల మోత మోగించింది. ఇదిలా ఉండగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు గ్రీటింగ్స్ తెలిపారు.