Prabhas: బాలీవుడ్ బ్యూటీతో ప్రభాస్ ఫోటో వైరల్ !

బాలీవుడ్ బ్యూటీతో ప్రభాస్ ఫోటో వైరల్ !

Hello Telugu - Prabhas

Prabhas: వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ప్రస్తుతం ఇటలీలో ప్రభాస్(Prabhas), దిశా పటానీపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇటలీలో షూటింగ్ కు సంబంధించి ప్రభాస్, దిశ పటానీలు జంటగా ఉన్న ఓ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థం వైజయంతి మూవీస్. ప్రస్తుతం ఈ ఫోటో వివిధ సోషల్ మీడియా వేదికలపై వైరల్ గా మారుతోంది.

Prabhas Movie Updates

ఈ ఫోటోలు ప్రభాస్‌… కళ్లద్దాలు పెట్టుకుని, స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ప్రక్కనే దిశపటానీ నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ‘కల్కి 2898 AD’ సినిమా విషయానికి వస్తే… ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ గతంలో తెలిపారు. ‘‘మహాభారతంతో మొదలై… క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథ ఇది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన స్టోరీ కాబట్టి అందుకు తగ్గట్టు ఆయా ప్రపంచాల్ని సృష్టించారు.

Also Read : Meera Chopra: పెళ్లి పీటలెక్కబోతున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com