Power Star : షూటింగ్ కి ఓకే అన్న పవర్ స్టార్..బెజవాడలో సెట్స్ ప్లాన్ చేస్తున్న మేకర్స్

షూటింగ్‌ విజయవాడలో పెట్టుకుంటే, వీలున్నప్పుడల్లా కంప్లీట్‌ చేసేద్దాం అని మేకర్స్ తో అన్నారట పవర్‌స్టార్‌...

Hello Telugu - Power Star

Power Star : మీరిక్కడికి వస్తారా? మమ్మల్నే అక్కడికి రమ్మంటారా?… ఎవరు ఎక్కడికి వచ్చినా సినిమా షూటింగ్‌లో ప్రోగ్రెస్‌ ముఖ్యం అంటోంది హరిహరవీరమల్లు టీమ్‌. జస్ట్ అనడమే కాదు.. అన్నంత పని చేసి చూపిస్తోంది. అంతగా ఏం చేస్తోందంటారా.? హరిహరవీరమల్లు సినిమాను ఎలాగైనా ఈ ఏడాది ఆఖరిలోపు విడుదల చేయాలి. అలా చేస్తే, ఓటీటీ డీల్‌ ప్రకారం ప్రొడ్యూసర్లు సేఫ్‌ అవుతారు. మరి.. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మేకర్స్ ముందడుగు వేస్తున్నారా? రీసెంట్‌గా పవర్‌స్టార్‌(Power Star)ని కలిసినప్పుడు ఆయనేం చెప్పారు.? వీళ్లు ఏమన్నారు.?

Power Star Movies Update

షూటింగ్‌ విజయవాడలో పెట్టుకుంటే, వీలున్నప్పుడల్లా కంప్లీట్‌ చేసేద్దాం అని మేకర్స్ తో అన్నారట పవర్‌స్టార్‌. ఆ మాట ప్రకారమే విజయవాడలో స్పెషల్‌ సెట్స్ వేస్తోంది టీమ్‌. ఈ నెల 23 నుంచి విజయవాడలో హరిహరవీరమల్లు షెడ్యూల్‌ స్టార్ట్ అవుతుంది. దాదాపు 20 రోజులు పవర్‌స్టార్‌ కాల్షీట్‌ ఇస్తే, ఈ షూటింగ్‌ పూర్తవుతుంది. ఆయన కాల్షీట్‌ని బట్టి, మిగిలిన ఆర్టిస్టుల కాల్షీట్‌ కూడా తీసుకుంటున్నారు మేకర్స్. హరిహర వీరమల్లు షూట్‌ కంప్లీట్‌ అయ్యాకే ఓజీ సెట్స్ కి వెళ్లాలన్నది పవర్‌స్టార్‌ ప్లాన్‌. ఓజీ పూర్తయ్యేలోపు ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ స్క్రిప్ట్ కి మార్పులూ చేర్పులూ చేయాలనుకుంటున్నారు హరీష్‌ శంకర్‌. ఒక్క సినిమాలో కదలిక వస్తే, మిగిలిన అన్నీ సినిమాల్లోనూ వేగం పెరుగుతుందన్నది ఫ్యాన్స్ లో ఆనందం నింపుతున్న విషయం.

Also Read : Hero Suriya : ఆ స్టార్ హీరో ను ఢీకొట్టేందుకు విలన్ అవతారంలో సూర్య

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com