Posani : ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, భువనేశ్వరిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పర్చడంతో రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ గ్రాంట్ చేసింది.
Posani Krishna Murali Bail
గత ఫిబ్రవరి 26న పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ లో మఫ్టీలో ఉన్న పోలీసులు అనంతపురం జిల్లాకు తీసుకు వచ్చారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులకు సంబంధించి ఆయా స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగలేదనంటూ క్వాష్ చేయాలంటూ దావా దాఖలు చేశారు. చివరకు వాదోపవాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోసాని కృష్ణ మురళికి భారీ ఊరటనిస్తూ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు చెప్పారు.
అయితే నోరు అదుపులో పెట్టు కోవాలని, రూ. 2 లక్షల పూచీకత్తు సమర్పించాలని, మీడియాతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడ కూడదని, నాలుగు వారాల పాటు రెండుసార్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు పెట్టాలని స్పష్టం చేశారు. దీంతో గుంటూరు చెరసాల నుంచి బయటకు వచ్చిన పోసాని కృష్ణ మురళి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read : Popular Actor Posani : పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు