Poonam Kaur : జానీ మాస్టర్ పై సంచలన ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్

ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖలు కూడా స్పందిస్తున్నారు...

Hello Telugu - Poonam Kaur

Poonam Kaur : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ పై ఓ లేడీ డ్యాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే పలు సార్లు క్యార్ వాన్ లో నూ బలవంతం చేశాడని, బయటకు చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడంటూ సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదును పరిగణణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.దక్షిణాదిలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్(Jani Master) ఇప్పుడిలా లైంగిక ఆరోపణల్లో చిక్కు కోవడం తెలుగు నాట సంచలనంగా మారింది.

ఈ వివాదంపై స్పందించిన జనసేన.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని జానీ మాస్టర్ ను ఆదేశించింది. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖలు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జానీ మాస్టర్‌పై విషయంపై స్పందించింది. ఇకపై అతనిని ఎవరూ మాస్టర్ అని పిలవొద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. ‘ నిందితుడు షేక్ జానీ ని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం, విలువ ఇవ్వండి’ అని ట్విట్టర లో రాసుకొచ్చింది పూనమ్ కౌర్(Poonam Kaur).

Poonam Kaur Tweet

అంతకు ముందు ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా జానీ మాస్టర్ పై వస్తోన్న ఆరోపణలపై స్పందించింది. పలు మీడియా కథానాలను ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేసిన ఆమె .. “నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది సింగర్ చిన్మయి. మొత్తానికి జానీ మాస్టర్ పై వస్తోన్న లైంగిక ఆరోపణలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Also Read : Jani Master : జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com