Poonam Kaur : పూనమ్ కౌర్ ఎప్పుడూ త్రివిక్రమ్ పై సెటైర్లు వేస్తుంటుంది. అయితే, పేరు నేరుగా ప్రస్తావించలేదు. అయితే త్రివిక్రమ్ ను మాత్రం గురూజీ అంటూ హేళన చేస్తూనే ఉంటుంద. తను గ్రేట్ డైరెక్టర్ తనను అవమానించాడని, చిత్రహింసలకు గురిచేశాడంటూ పూనమ్ కౌర్(Poonam Kaur) తనకి చాలాసార్లు, రకరకాలుగా ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. అయితే తను ఎప్పుడూ త్రివిక్రమ్ పేరును బహిరంగంగా ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లపై పూనమ్ కౌర్ అప్పుడప్పుడు చేసిన ట్వీట్లు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి.
Poonam Kaur Comments Viral
గుంటూరు కారం నవలను ఆధారంగా చేసుకొని సినిమా తీశారని మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఆయన కీర్తి కిరీటాలు అనే నవల నుంచి స్వీకరించినట్లు వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్‌కు సంబంధించిన ఈ రూమర్లపై పూనమ్ ట్వీట్ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలపై పూనమ్ స్పందించింది.
అతను ఏదైనా చేయగలడు. ఏమి చేసిన బయటపడగలడు. అతని అకృత్యాలు ప్రజలకు కనిపించవు. అతనికి ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయని ఆమె కౌంటర్ ఇచ్చింది. సీఎం డిపార్ట్మెంట్ మేనేజర్‌గా కూడా ఆయన పనిచేయగలరని చెబుతున్నారు. యద్దనపూడి సులోచనా రాణి రాసిన నవలని ఆధారంగా తీసుకుని ఆధునిక కాలానికి తగ్గట్టుగా మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత పవన్ కళ్యాణ్‌తో చేసిన అజ్ఞాతవాసి టైమ్‌లో మరికొందరి నుంచి కాపీ ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టాడు. ఇప్పుడు గుంటూరు కారం మీద కూడా అలాంటి విమర్శలే ఎదురవుతున్నాయి.
Also Read : Suriya Emotional : విజయకాంత్ సమాధి వద్ద కన్నీటి పర్యంతమైన సూర్య