సినీ రంగం అంటేనే తళుకు బెళుకులు. సక్సెస్ ఉంటేనే పలకరిస్తారు. ఆ తర్వాత లేదంటే చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. అందుకే నటీ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు ఎల్లప్పుడూ లైమ్ లైట్ లో ఉండేందుకు నానా తంటాలు పడుతుంటారు.
ప్రస్తుతం ఒక వెలుగు వెలిగిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె తొలిసారిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మొదటి సినిమా ఆడలేదు. నిరాశ పరిచింది. దీంతో తెలుగు సినిమా ఆదరించింది. మెల మెల్లగా పుంజుకునేలా చేశాయి ఇక్కడి మూవీస్.
హరీశ్ శంకర్ తో దువ్వాడ జగన్నాథం, త్రివిక్రమ్ తో అరవింద సమేత, అల వైకుంఠ పురంలో చిత్రాలు బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయ్యాయి. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా నిరాశ పరిచాయి. డార్లింగ్ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్ , రామ్ చరణ్ , చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య వర్కవుట్ కాలేదు.
ఇదే సమయంలో ప్రతిష్టాత్మకంగా ప్రిన్స్ మహేష్ బాబు తో తీస్తున్న గుంటూరు కారంలో మొదట ఓకే చేశారు. కానీ ఆ తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకుంది. అంతకు ముందు ఆమె మహేష్ బాబుతో కొరటాల చిత్రంలో నటించింది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ తో నటించింది. ఆ సినిమాపై అంచనాలు గల్లంతయ్యాయి. మొత్తంగా పూజా హెగ్డే పరిస్థితి అయోయంగా మారింది.