Pooja Hegde : ఇటు తెలుగులో అటు హిందీలో బిజీగా ఉంది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే(Pooja Hegde). తన సినీ కెరీర్ లో ఎక్కువ సక్సెస్ రేట్ టాలీవుడ్ లోనే. స్టార్ హీరోల సరసన నటించింది. డార్లింగ్ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తో నటించింది. అద్భుతమైన పాత్రలు పోషించింది. తను 2010లో మిస్ యూనివర్స్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. ముఖమూడి చిత్రంలో తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఎంట్రీ తమిళంలో.
Pooja Hegde Shocking Her Fans
టాలీవుడ్ లో కంటిన్యూ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత ఆశించిన మేర సక్సెస్ అందుకోక పోవడంతో ఛాన్స్ లు తగ్గాయి. అయినా ఎక్కడా తగ్గేదే లేదంటూ ముందుకు సాగుతోంది పూజా హెగ్డే.
ఒక లైలా కోసం మూవీలో చైతన్యతో కలిసి నటించిన పూజా హెగ్డే(Pooja Hegde) బన్నీతో కలిసి నటించిన దువ్వాడ జగన్నాథం మూవీలో అందాలను ఆరబోసింది. బికీనీ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. కుర్రకారు గుండెల్ని షేక్ చేసింది. ఈ చిత్రం బిగ్ సక్సెస్ కావడంతో వరుసగా సినిమాలు చేసింది.
ఇక్కడ ఛాన్స్ లు తగ్గడంతో హిందీకి వెళ్లింది. అంతలో తమిళలంలో సూపర్ స్టార్ దళపతి విజయ్ తో కలిసి నటించింది. ఆ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో పూజా హెగ్డేను ఐరెన్ లెగ్ అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. బీస్ట్ మూవీలో నటించిన ఈ బుట్టబొమ్మ ఉన్నట్టుండి మరో మూవీలో కన్ ఫర్మ్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ యాక్టర్ షాహిద్ కపూర్ తో కలిసి పూజా హెగ్డే దేవా చిత్రంలో నటించింది.
ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా చిట్ చాట్ లో తాను ఇంకా లవ్ లో పడలేదని అయితే సినిమాల్లో పడ్డానంటూ హోయలు పోయింది.
Also Read : Beauty Rashmika-Salman : కండల వీరుడితో నేషనల్ క్రష్