ముంబై – అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. విజయ దశమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని హీరోయిన్లు హల్ చల్ చేశారు. కొత్త వాహనాలకు పూజలు చేశారు. తాజాగా లవ్లీ గర్ల్ పూజా హెగ్డే వైరల్ గా మారారు. భారీ ధరకు రేంజ్ రోవర్ ను కొనుగోలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
మాల్దీవులకు వెళ్లింది వెకేషన్ కోసమని పూజా హెగ్డే. షాహిద్ కపూర్ తో కొత్త ప్రాజెక్టు ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అందరి దృష్టి ఆమెపై ఉంది. ముంబై లోని తన ఇంటికి కొత్త రేంజ్ రోవర్ ఎస్వీ వెహికిల్ ను తీసుకు వచ్చింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా పంచుకుంది పూజా హెగ్డే. ఇదిలా ఉండగా కొత్త వాహనం ఖరీదు ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. బ్యూటీ ఆన్ వీల్స్ , 3.0 లీటర్ , 6 సిలిండర్ ఇంజెనియం పెట్రోల్ ఇంజన్ తో 294 కేడబ్ల్యూ మోటార్ తో వస్తుంది ఇది వెహికల్. 404.5 కిలోవాట్స్ మిశ్రమ శక్తిని అందిస్తుంది.
డిజిటల్ లెడ్ హెడ్ లైట్లతో కూడిన గ్రిల్ డిజైన్ ను కలిగి ఉంది రేంజ్ రోవర్. 33.27 సె.మీ. టచ్ స్క్రీన్ , సీట్ కెపాసిటీ, డిస్ ప్లే ఆకట్టుకునేలా ఉంది రేంజ్ రోవర్.