Swathi Deekshit: టాలీవుడ్ నటిపై భూ కబ్జా కేసు

టాలీవుడ్ నటిపై భూ కబ్జా కేసు

Hellotelugu-Swathi Deekshit

Swathi Deekshit : ఏం పిల్లో, ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై… తెలుగు, తమిళ, బెంగాలీ భాషల్లో నటిస్తున్న టాలీవుడ్ నటి స్వాతి దీక్షిత్ పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఓ ఎన్‌ఆర్‌ఐ కు చెందిన 30 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో పాటు అడ్డొచ్చిన వాచ్ మెట్ కుటుంబంపై దాడిచేసారన్న ఆరోపణలతో స్వాతి దీక్షిత్(Swathi Deekshit) తో పాటు మరో 20 మంది దుండగులపై కేసు నమోదు చేసారు.

Swathi Deekshit – 1100 గజాల్లో ఖరీదైన భవనం కబ్జాకు స్వాతి ప్రయత్నం

అమెరికాలో నివశిస్తున్న అవతారం మాధురి అనే ఓ ఎన్ఆర్ఐ కు జూబ్లీహిల్స్ రోడ్ నెం 58లో 1100 గజాల్లో భవనం ఉంది. మొదటి ఫ్లోర్ లో మాధురి బంధువులు నివశిస్తుండగా… గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్థలంలో కాఫీ షాప్ ఏర్పాటుకు సినీ నటి స్వాతి దీక్షిత్ ఆ ఎన్ఆర్ఐతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో లీజు రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై న్యాయస్థానాల్లో వివాదం నడుస్తోంది.

ఇది ఇలా ఉండగా సోమవారం సాయంత్రం సుమారు 20 మంది దుండగులు కలిసి భవనం వద్దకు వచ్చిన స్వాతి దీక్షిత్… దౌర్జన్యంగా గేటు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అడ్డుకున్న వాచ్‌మెన్‌ అశోక్‌ భార్య శోభారాణి మీద దాడి చేయడంతో పాటు ఇంట్లోని వస్తువులను ధ్వంసంచేశారు. దీనితో వాచ్ మెన్ ఇచ్చిన సమాచారం మేరకు మాధురి… జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంటి యజమాని మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో దుండగుల్లో కొందరు పరారు కాగా ఇద్దరు మాత్రం పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో రణ్‌వీర్‌ సింఘ్‌, కండె రాంకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

స్వాతి దీక్షిత్ తో సహా మరో ముగ్గురిపై భూ కబ్జా కేసు

ఇది ఇలా ఉండగా తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారంటూ స్వాతి దీక్షిత్‌, చింతల ప్రశాంత్‌ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ వాచ్‌మెన్‌ శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నటి స్వాతి దీక్షిత్‌తో పాటు మరో మగ్గురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు.

Also Read : Tamannaah: ఆ డైరెక్టర్‌తో కూడా తమన్నా రిలేషన్‌లో ఉందా?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com