Kasthuri : నటి కస్తూరి అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్న పోలీసు బలగాలు

తమిళనాడురాజకీయాల్లో ద్రావిడ సిద్ధాంతాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...

Hello Telugu - Kasthuri

Kasthuri : రాజుల‌ అంతఃపురంలో చెలికత్తెలుగా ప‌ని చేయ‌డానికి తెలుగు వారు ఇక్క‌డికి వచ్చి తమిళులుగా చలామణి అయ్యారని ఇటీవ‌ల తెలుగు ప్ర‌జ‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన న‌టి, బీజేపీ నేత‌ క‌స్తూరి ఆరెస్టుకు రంగం సిద్ధ‌మైంది. ఆ కామెంట్ల‌పై తీవ్రంగా ఆగ్ర‌హించిన తెలుగు సంఘాలు, తెలుగు నేతలు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఫిర్యాదు చేశారు. దీంతో నటి కస్తూరిని ఏ స‌మ‌యంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

Kasthuri Comments..

తమిళనాడురాజకీయాల్లో ద్రావిడ సిద్ధాంతాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిద్ధాంతం ప్రకారం బ్రాహ్మణులూ.. తమిళులు కాదని వాదన. అయితే ఈ వాదనలను విమర్శిస్తూ నటి కస్తూరి(Kasthuri).. “రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ‌ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ” మాట్లాడారు. అలాగే “ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజు పడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని” కస్తూరి(Kasthuri) వ్యాఖ్యలు చేసింది.

ఆమెమాట‌ల‌తో తెలుగు వారితో పాటు తమిళనాడు ప్రజలు కూడా ఊగిపోతున్నారు. సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ మొద‌లు పెట్ట‌డం, తెలుగు వారి నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న‌ ఎదుర‌వ‌డంతో క‌స్తూరి వెంట‌నే కాళ్ల బేరానికి వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో పాటు త‌న వ్యాఖ్య‌ల‌కు వివ‌ర‌ణ ఇచ‌చ్ఏ ప్ర‌య‌త్నం చేసింది. పైగా తెలుగు మీడియాను, తెలుగు ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ వరుస ట్వీట్లు పెట్టారు.హైదరాబాదులో ప్రెస్మీట్ పెట్టి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని అనుకున్నప్ప‌టికీ తాజా పరిణామాలతో ఆ నిర్ణ‌యాన్ని విరమించుకుంది. ఈ నేప‌థ్యంలో కస్తూరి కోసం తమిళనాడు సీఐడీ పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు.

నటి’కస్తూరి(Kasthuri)’ తెలుగు వారిపై చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన ‘X’ ఖాతా ద్వారా వరుస పోస్టులు చేశారు. ” ఏపీ, తెలంగాణ ప్రజలారా.. డీఎంకే పార్టీ వక్రీకరించిన నా స్పీచ్ ని నమ్మకండి, నాకు తెలుగు ప్రజలంటే ఎంతో ప్రేమ, గౌరవం” అన్నారు. మరొక ట్వీట్ చేస్తూ.. ష‌ నా మెట్టిల్లు తెలుగు, నా ఫ్యామిలీ తెలుగు అని తెలియక కొంతమంది ఇడియట్స్ కామెడీ చేస్తున్నారు. కొంతమంది యాంటీ హిందువులు తమ అబద్దాలతో సనాతన లీడర్లైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలను ట్యాగ్ చేసి ఎం చేయగలరు” అన్నారు. ఇక మూడో ట్వీట్ లో ” తమిళుల మధ్య విభజన ద్వేషపూరిత రాజకీయాలు సృష్టిస్తున్న కొందరు మోసపూరిత ద్రావిడ నాయకులు తమ ద్వంద వైఖరితో నేను తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ ఫేక్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు” అంటూ రాసుకొచ్చారు. ఏదిఏమైనప్పటికీ ఆమె ఒరిజినల్ స్పీచ్ ని పెద్దగా వక్రీకరించనట్లు ఎం కనపడటం లేదని చాలా మంది తెలుగు ప్రజలు ఆమెపై ఫైర్ అవుతున్నారు. తెలుగు వాళ్ళకి తోడుగా మరికొందరు తమిళులు మద్దతు తెలుపుతున్నారు.

Also Read : Sai Dharam Tej : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com