PM Modi : నటుడు నాగార్జున, అమల ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తన తండ్రి దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు 100వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఇటీవల అక్కినేని పేరు మీద ఏర్పాటు చేసిన అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు.
PM Modi Praises Legendary Actor..
అక్కినేని నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర, విశేషాలను మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పుస్తకం రాశారు. దీనిని ప్రధాని మోడీకి అంకితం ఇచ్చారు. ఈ సందర్బంగా పార్లమెంట్ హౌస్ లో ప్రధానిని కలుసుకున్నారు.
ఈ సందర్బంగా పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. ఆయన గొప్ప నటుడంటూ కితాబు ఇచ్చారు.
తమ ప్రభుత్వం సినిమా రంగం అభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు మోడీ. టాలీవుడ్ కు సంబంధించి దివంగత నందమూరి తారక రామారావు, ఏఎన్ఆర్, శోభన్ బాబు లాంటి గొప్ప నటులను కలిగి ఉన్నారంటూ ప్రశంసలు కురిపించారు నరేంద్ర మోడీ.
Also Read : Beauty Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి పవిత్ర స్నానం