PI Meena Web Series : అటు సినిమా ఇటు బుల్లి తెరకు ధీటుగా ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు దుమ్ము రేపుతున్నాయి. నెట్ ప్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్ తో పాటు ఆహా ఓటీటీలు పోటా పోటీగా దూసుకు పోతున్నాయి. ఇవాళ సినిమా ప్రపంచాన్ని సవాల్ చేసే స్థాయికి తీసుకు వెళ్లింది ఓటీటీ.
PI Meena Web Series Status
వీక్షకులు లేదా ప్రేక్షకులు నేరుగా థియేటర్ల వద్దకు వెళ్లేందుకు ఇష్ట పడడం లేదు. ఎంతో ఎంజామ్ మెంట్, ఫన్ , ఆలోచింప చేసేలా ఉంటేనే మూవీస్ చూస్తున్నారు. దీంతో ఇవాళ మార్కెట్ అంతా ఓటీటీ(OTT)లపై పడుతోంది. దీంతో దిగ్గజ సంస్థలన్నీ తమదైన రీతిలో కంటెంట్ అందిస్తూ భిన్నమైన కథలతో ముందుకు వస్తున్నాయి.
రొమాన్స్ , థ్రిల్లర్, క్రైమ్ , డిటెక్టివ్, పాలిటిక్స్, బయో పిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశాన్నీ కదిలించేలా వెబ్ సీరీస్ లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వేటిని చూడాలో తెలియక జనం తికమక పడుతున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్లకు యమ గిరాకీ పెరుగుతోంది. తాజాగా ఈ వెబ్ సీరీస్ లలో కొంచెం మెదడుకు పని పెట్టేలా చేస్తోంది పీఐ మీనా వెబ్ సీరీస్ .
ఇది నవంబర్ 3న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. ఇందులో తాన్యా కీలక పాత్ర పోషించింది. తనే హైలెట్ గా నిలిచింది. వ్యూయర్షిప్ కూడా బాగానే ఉంటోంది. వీలైతే మీరూ చూడండి.
Also Read : Nayanthara Annapoorni : నయన్ అన్నపూర్ణి రిలీజ్ రెడీ