ఇప్పుడు వెబ్ సీరీస్ లు రాజ్యం ఏలుతున్నాయి. మరో వైపు వెండి తెర కూడా కొత్త సినిమాలతో వెలిగి పోతోంది. ఇక తెలుగు విషయానికి వస్తే మంచి మంచి కాన్సెప్టులతో టాలెంట్ కు పదును పెడుతున్నారు.
సాంకేతికంగా యూట్యూబ్ మాధ్యమం అందుబాటులోకి వచ్చాక సీన్ మారి పోయింది. లెక్కకు మించి నటీ నటులు తమ ప్రతిభకు పదును పెడుతూ ఆకట్టుకునేలా చేస్తున్నారు.
అలాంటి కోవలోకి వచ్చిందే పెళ్లి కాని ప్రసాద్. ఇన్ఫినిటిమ్ నెట్ వర్క్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో వరుసగా మంచి కాన్సెప్ట్ తో వెబ్ సీరీస్ లు వస్తున్నాయి. వాటిలో ఇది ఒకటి. జేడీ ప్రసాద్, స్నేహల్ కామత్ , శివ ప్రసాద్ , డాలీ గాయత్రి, సతీష్ సరిపల్లి, గణేష్ , విశ్వాస్ , ఫణి పవన్ , తదితరులు నటించారు. ఆద్యంతమూ పంచ్ లు, ప్రాసలతో నడుస్తోంది ఈ సీరీస్.
ఎస్డీ చాడా కాన్సెప్ట్ రూపొందిస్తే దానికి అందంగా తెర కెక్కించే ప్రయత్నం చేశాడు జేడీవీ ప్రసాద్. రాసింది మాత్రం సంతోష్ వడకట్టు. డీఓపీ హేమంత్ అందిస్తే కుంబ శివకుమార్, సాయి కృష్ణ ఎడిటింగ్ నిర్వహించారు. పెళ్లి కాని ప్రసాద్ తన జీవితంలో ఎలా ట్రై చేస్తాడనే దానిపై సీరీస్ రూపొందించాడు.