దేశ వ్యాప్తంగా వెబ్ సీరీస్ హవా కొనసాగుతోంది. సీరియళ్లు, సినిమాలు మోత మోగిస్తున్నాయి. ప్రత్యేకించి సినిమా రంగం భారీ ఖర్చుతో కూడుకుని ఉన్నది కావడంతో చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వెబ్ సీరీస్ వైపు మళ్లుతున్నారు.
ప్రత్యేకించి టెక్ దిగ్గజం గూగుల్ యూట్యూబ్ ను అందుబాటులోకి తీసుకు రావడంతో ప్రతిభ కలిగిన కళాకారులు, రచయితలు, నటీ నటులకు భారీ ఎత్తున ఛాన్స్ లు లభిస్తున్నాయి. షార్ట్ ఫిలింలతో మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక నెట్ ఫ్లిక్స్ , స్టార్ మా , ఆహా , అమెజాన్ ప్రైమ్ వచ్చాక సీన్ మారింది. కుప్పలు తెప్పలుగా ఛాన్స్ లు లభిస్తున్నాయి. తాజాగా పెళ్లి వారమండి వెబ్ సీరీస్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది. భారీ ఆదరణను చూరగొంటోంది. దీనికి దర్శకత్వం ప్రసాద్ బెహరా దర్శకత్వం వహించడమే కాదు నటించారు.
విరాజిత, కంచన్ బమ్నే, తదితరులు నటించారు. ఇన్ఫినిటమ్ మీడియా సంస్థ భారీ ఖర్చుతో ఎక్కడా రాజీ పడకుండా పెళ్లి వారమండి పేరుతో వెబ్ సీరీస్ ను టెలికాస్ట్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ వేదికగా దుమ్ము రేపుతోంది. ఎంతో కష్టపడి అందరిని ఆకట్టుకునేలా తీర్చి దిద్దాడు. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. వీలైతే మీరు కూడా చూడండి. లైఫ్ ని పొయెటిక్ గా , పంచులు ప్రాసలతో హోరెత్తించాడు దర్శకుడు.