విషాదంలో పాయల్ రాజ్‌పుత్ !
టాలీవుడ్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సెక్సీ బ్యూటీగా గుర్తింపు పొందిన ఈ ఢిల్లీ బ్యూటీ… ఇటీవల ‘మంగళవారం’ సినిమాతో మరోసారి కుర్రకారుని ఆకట్టుకుంది. ‘మంగళవారం’ సినిమాతో క్రేజీ హిట్ కొట్టిన పాయల్ రాజ్ పుత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క క్యాండీ చనిపోయింది. ఈ విషయాన్ని బాధతో చెప్పుకొచ్చిన పాయల్… క్షమించు క్యాండీ నిన్ను బతికించుకోలేకపోయాను అని తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అంతేకాదు పెట్ డాగ్‌తో ఉన్న రోజుల్ని గుర్తుచేసుకుని పలు వీడియోల్ని కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది.
‘నీ హగ్స్, నీ ప్రేమని మిస్ అవుతా… ఇంకా నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది… నిన్ను ఎంతగానో ప్రేమించా… ఇకపై నా జీవితాంతం మిస్ అవుతూనే ఉంటా… ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశావ్… నువ్వెక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి… నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్ట్ ను పాయల్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీనితో పాయల్ పోస్ట్ పై నెటిజన్లతో పాటు పాయల్ సన్నిహితులు కూడా స్పందిస్తున్నారు. క్యాండీ మృతికి సంతాపం తెలుపుతూ… పాయల్ ను ఓదార్చుతున్నారు.