Payal Rajput : చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటికే తిష్ట వేసుకుని ఉన్న వారికే ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయని, టాలెంట్ ఉన్నా ఎవరూ పట్టించు కోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి పాయల్ రాజ్ పుత్(Payal Rajput). ఆర్ఎక్స్ 100 మూవీతో పాపులర్ పొందిన తను ఉన్నట్టుండి ఘాటుగా సినీ ఇండస్ట్రీ గురించి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు తమకు అనువుగా ఉన్న వారికే ఛాన్స్ లు ఇస్తున్నారంటూ వాపోయింది.
Payal Rajput Shocking Comments
దీంతో ప్రతిభ కలిగిన తన లాంటి వాళ్లు సినీ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారని కానీ వారి గురించి ఆలోచించక పోవడం దారుణమని పేర్కొంది. దర్శక, నిర్మాతలు సైతం పేరు పొందిన హీరో, హీరోయిన్ల కుటుంబాల నుంచి వచ్చిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారంటూ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ. ఇలాగైతే టాలెంట్ ఉన్న వాళ్లు ఏం కావాలంటూ ప్రశ్నించింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. దీని వల్ల ఎందరో సినీ రంగానికి రాకుండానే కనుమరుగై పోతారంటూ వాపోయింది.
ఇదిలా ఉండగా పాయల్ రాజ్ పుత్(Payal Rajput) ఆర్ఎక్స్ 100 తర్వాత మాయా పేటిక, రక్షణ, తీన్ మార్ ఖాన్, వెంకీ మామ, మంగళవారం చిత్రాలలో నటించింది. కానీ ఆశించిన మేర తనకు అవకాశాలు దక్కడం లేదంటూ ఆందోళన చెందుతోంది. దీంతో పూర్తిగా ఫస్ట్రేషన్ కు గురైన పాయల్ రాజ్ పుత్ ఉన్నట్టుండి సినీ రంగంపై ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం మూవీస్ సెక్టార్ లో బంధు ప్రీతి, వివక్ష రాజ్యం ఏలుతోందంటూ ట్వీట్ చేసింది. ఇతర రంగాల కంటే సినీ పరిశ్రమలో నిత్యం సవాళ్లు, ఆధిపత్య ధోరణలు ఎక్కువగా ఉంటాయని ఆరోపించింది.
Also Read : Beauty Divya Bharathi :తనతో డేటింగ్ అబద్దం స్నేహం నిజం