Rakshana: ‘Rx100’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం ‘లక్షణ’. రోషన్, మానస్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్.
Rakshana Movie 1St Look Viral
ఫస్ట్ లుక్ చూస్తే పాయల్ రాజ్‌పుత్ గత చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అని అనిపిస్తుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన ఈ సినిమాలో పాయల్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లక్షణ’ చిత్రం క్రైమ్ డ్రామా. పాయల్ రాజ్‌పుత్(Payal Rajput)ని పూర్తిగా కొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కింది. ఏ దశలోనూ రాజీపడకుండా అధిక నిర్మాణ విలువలతో సినిమాలను నిర్మిస్తాం. పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
Also Read : Allu Arjun : ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బన్నీపై నంద్యాల 2 టౌన్ పిఎస్ లో కేసు